Indo-China: భారత్, చైనా సంబంధాల్లో పురోగతి.. ప్రధాని మోదీ
భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని..స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ని కలిసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని..స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ని కలిసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
ఎన్నికల సంఘం చీఫ్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్ష కూటమి సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో 'ఓట్ల చోరీ' జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట 2 వంతుల మెజారిటీ అవసరం.
పాకిస్తాన్ అంతటా ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. వరదల వలన మొత్తం గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ఒక టోల్ బూత్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టారు. సైనికుడిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నలుగురు టోల్ బూత్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 పాయింట్ల మార్క్ దక్కించుకోగా, సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రభుత్వ సంస్కరణలు, ముఖ్యంగా జీఎస్టీలో రాబోయే మార్పులపై అంచనాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది.
భారత్ పై సుంకాల చర్చలు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా పాడి ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి తేవాలని ఆ దేశం వత్తిడి తీసుకువస్తోంది. దీనిపై జరగనున్న చర్చల్లో భాగంగా ఢిల్లీకి రావాల్సిన అమెరికా బృందం పర్యటన వాయిదా పడవచ్చని సమాచారం.
భారత్, చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగుపరిచే దిశగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటించనున్నారు.సరిహద్దు సమస్యలపై వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటూ మరి కొంతమంది నేతలను చర్చించనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బీహార్ లో ఓటర్ అధికార యాత్రను చేపట్టనున్నారు. ససారాం నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు 25 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది.
భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ సుభాంషు శుక్లా ISS యాత్ర తర్వాత మొదటిసారిగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. విమానంలో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోను శుభాన్షు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.