Operation Sindoor: ధ్వంసమైన పాక్ ఎయిర్ బేస్‌లో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన పాక్ ఎయిర్ బేస్ నూర్ ఖాన్ పునర్నిర్మాణ పనులను చేపట్టినట్లు తాజా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. రావల్పిండిలోని ఈ కీలకమైన వైమానిక స్థావరం, పాకిస్తాన్ సైన్యానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది.

New Update
Noor Khan, Pakistan Air Base

పహల్గామ్ అటాక్‌కు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొన్ని నెలల క్రితం "ఆపరేషన్ సిందూర్" చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్తాన్‌లోని ఎయిర్ బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిలో ఒకటి, పాకిస్థాన్‌కు ముఖ్యమైనది నూర్ ఖాన్ వైమానిక స్థావరం  పునర్నిర్మాణ పనులను చేపట్టినట్లు తాజా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. రావల్పిండిలోని ఈ కీలకమైన వైమానిక స్థావరం, పాకిస్తాన్ సైన్యానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఇది దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలో ఉంది.

"ఆపరేషన్ సిందూర్"లో భాగంగా భారత వైమానిక దళం నూర్ ఖాన్ స్థావరంతో పాటు మరికొన్ని పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిపింది. ఈ దాడుల వల్ల నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లోని రన్‌వేలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఇండియన్ ఆర్మీ అప్పట్లో ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ దాడి జరిగిన విషయాన్ని తర్వాత అంగీకరించారు. ఈ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 20 శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ పాకిస్తాన్ ఎయిర్ మొబిలిటీ కమాండ్‌కు ప్రధాన కార్యాలయం. ఇక్కడ సీ-130 రవాణా విమానాలు, ఐఎల్-78 మిడ్-ఎయిర్ రీఫ్యూలింగ్ ట్యాంకర్లు, డ్రోన్ల ఫ్లీట్‌లు ఉన్నాయి. ఈ స్థావరాన్ని దెబ్బతీయడం ద్వారా భారత్ పాకిస్తాన్ వైమానిక దళం రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీని వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా పాకిస్తాన్ ఈ స్థావరాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది.

తాజా ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే, దెబ్బతిన్న రన్‌వేలపై మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇండియా దాడుల తర్వాత పాకిస్తాన్ కొన్ని రోజులపాటు తన గగనతలాన్ని మూసివేసింది. ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ తన వైమానిక, రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు