India-Russia Agreement: భారత్ లో రష్యా యుద్ధ విమానాలు..పాక్ కు ఇక మూడినట్టే..

భారత్ అమ్ములపొదిలో ఇప్పటికే చాలా ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లోకి సుఖోయ్ 57 ఫైటర్ జెట్ లు కూడా వచ్చి చేరనున్నాయి. రష్యా ఈ యుద్ధ విమానాలకు ఇకపై భారత్ లోని తయారు చేసే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ దెబ్బకు భారత్ అంటే పాక్ హడలి చావాల్సిందేనంటున్నారు.

New Update
SU-57

SU-57 Fighter Jets

రష్యా, భారత్ మధ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో చాలా మెరుగయ్యాయి. తాజాగా చైనాలో జరిగిన ఎస్సీవో సమావేశంలో ఈ ఫ్రెండ్షిప్ మరింత బలపడింది. రెండు దేశాలూ ఇప్పటికే చమురు తో పాటూ మరి కొన్ని వాణిజ్యం చేస్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు యుద్ధ విమానాలకు సంబంధించి కొత్త ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంతో భారతదేశం, రష్యా మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. రష్యా భారతదేశంలో సుఖోయ్ యుద్ధ విమానాలను తయారు చేయనుంది. రష్యా ఐదవ తరం ఫైటర్ జెట్ సుఖోయ్ లు ఇక మీదట భారత్ లో తయారు కానున్నాయి. ఇవి రష్యాతో పాటూ భారత్ కూడా తమ సైన్యంలో ఉపయోగించనున్నాయి. ఇవి అమెరికా ఎఫ్ 35 జెట్ ఫైటర్ లతో సమానమైనవని తెలుస్తోంది. ఇప్పటికే భారత్ సైన్యంలో ఎఫ్ 35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటికి తోడు రష్యా సుఖోయ్ జెట్ లు కూడా చేరితే పాక్ కు దబిడి దిబిడే అంటున్నారు. 

Also Read:  Trump Vs India: పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

మరింత శక్తి వంతంగా భారత ఆర్మీ..

ANI నివేదిక ప్రకారం, భారతదేశంలో యుద్ధ విమానాలను తయారు చేయడానికి రష్యా పరిశోధన ప్రారంభించింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇప్పటికే నాసిక్ ప్లాంట్‌లో రష్యన్ మూలానికి చెందిన Su-30 MKI యుద్ధ విమానాలకు లైసెన్స్ ఇచ్చింది . ఇప్పుడు Su-57 కూడా వాడొచ్చు. ప్రస్తుతం, Mk-1,  Mk-2 తో సహా తేజస్ ఫైటర్ జెట్‌లను భారతదేశంలో తయారు చేస్తున్నారు . Mk-1 ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ ఆధునిక ఆయుధాలతో అమర్చబడి ఉంది. ఇక Mk-2 అయితే బహుళ-ప్రయోజన యుద్ధ జెట్. ఇది Mk - 1 కు నెక్స్ట్ వెర్షన్. ఇప్పుడు వీటన్నింటి తోడు Su-57 కూడా త్వరలోనే భారత్ తో తయారు చేస్తారని తెలుస్తోంది. 

అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా, భారత్ ల మధ్య సంబంధాలు మరింత బలపడం చాలా అవసరం అంటున్నారు. అమెరికాను ఎదుర్కోవడానికి రష్యాతో వాణిజ్య, రక్షణ సంబంధాలు తోడ్పడతాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తాజా ఒప్పందాల వలన అమెరికా అధ్యక్షుడు భారత్ పై మరింత కోప్పడే అవకాశాలున్నాప్పటికీ...దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే..భారత్ ఒక్క అమెరికానే నమ్ముకోకుండా...ఇలా మిగతా దేశాలతో తమ సంబంధాలను మెరుగుపర్చుకోవడం మంచిదని అంటున్నారు. 

Also Read:  Rohith Sharma: నన్నెవరేం పీకలేరు..బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్

Advertisment
తాజా కథనాలు