/rtv/media/media_files/2025/09/02/piyush-2025-09-02-23-30-37.jpg)
Minister Piyush Goyal
అమెరికాతో భారత్ వాణిజ్య చర్చలు జరుపుతూనే ఉంది. మార్చి నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఇరు దేశాల అధికారులు, నేతలూ వీటిపై చర్చించారు. ఆగస్టులో కూడా అమెరికా ప్రతినిధులు ఇండియా రావాల్సి ఉంది. కానీ ట్రంప్ టారిఫ్ ల నేపథ్యంలో అది క్యాన్సిల్ అయింది. దీనిపై తాజాగా భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోమల్ మాట్లాడారు. డెడ్ లైన్స్ పెట్టుకుని తాము ఎప్పుడూ ఏ దేశం తోనూ చర్చలు చేయమని ఆయన అన్నారు. ఇరు వర్గాలకూ ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని గోయల్ చెప్పారు. భారత్ కు టైమ్ ఇచ్చాం..గడువు దాటి పోయిందని..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్ చేసిన నేపథ్యంలో మంత్రి గోయల్ ఇదంతా వివరించారు. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, చర్చలు ఆగిపోయాయి. కానీ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, గణనీయమైన పురోగతి ఉందని మంత్రి చెప్పారు.
వ్యవసాయ ఉత్పత్తులపై డిమాండ్..
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇది చాలా కాలంగా ఉంది. అయితే వారివి దిగుమతి చేసుకుంటే మన దేశంలో రైతులు, వ్యవసాయదారులు నష్టపోతారు. అందుకే యూఎస్ డిమాండ్ ను తాము ఒప్పుకోవడం లేదని మరోసారి మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇది కేవలం వాణిజ్య పరంగానే కాదు...రాజకీయంగా కూడా చాలా సున్నితమైన అంశం. తొందరపడి నిర్ణయాలు ఇరు దేశాలకూ మంచిదని కాదని అన్నారు. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతి మీద కూడా అమెరికా వత్తిడి తీసుకువస్తోంది. అయితే దానిని భారత్ ఎప్పటికీ వదులుకోదు. అమెరికా ఒత్తిళ్ల మధ్య కూడా భారత్‌కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. ఇది దేశ ప్రయోజనాలకు ఎంతో ముఖ్యమని గోయల్ వివరించారు.
Also Read: Trump Exit: ట్రంప్ రాజీనామా...వైట్ హౌస్ ప్రకటన..హోరెత్తుతున్న సోషల్ మీడియా