Amit Mishra: క్రికెట్ కు అమిత్ మిశ్రా గుడ్ బై!

భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తరచుగా గాయాల బారిన పడటం, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

New Update
amit mishara

Amit Mishra

Amit Mishra: 

భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్(Cricket) నుండి రిటైర్మెంట్(Retirement) ప్రకటించాడు. తరచుగా గాయాల బారిన పడటం, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమిత్ మిశ్రా భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ, యువ క్రికెటర్లకు మార్గదర్శకుడిగా వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు తన ప్రకటనలో తెలిపారు. దీంతో  అమిత్ మిశ్రా పాతికేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు బ్రేక్ పడింది. 42 ఏళ్ల అమిత్‌ మిశ్రా  ఢిల్లీకి చెందినవాడు. 2003లో టీమిండియా తరఫున క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అమిత్‌ మిశ్రా.. 2017లో ఇంగ్లండ్‌తో టీ20 సందర్భంగా తన అంతర్జాతీయ స్థాయిలో తన చివరి మ్యాచ్‌ ఆడాడు. 

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

ఇప్పటివరకు టీమిండియా తరుపున 36 వన్డేలు, 22 టెస్టులు, పది టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇక వన్డేల్లో 64, టెస్టుల్లో 76, అంతర్జాతీయ టీ20లలో అమిత్‌ మిశ్రా 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 2008లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్‌ బౌలర్‌.. గతేడాది చివరగా లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆడాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో మొత్తంగా 162 మ్యాచ్‌లు ఆడి 174 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అమిత్ మిశ్రా ఒకరు. ఐపీఎల్‌లో మూడు హ్యాట్రిక్స్ సాధించిన ఏకైక బౌలర్‌గా ఆయన రికార్డు సృష్టించారు.

Also Read :  New Liquor Policy: మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై హాటల్స్‌లో కూడా బీర్ల అమ్మకాలు

ఐపీఎల్ లో  లసిత్ మలింగ, డ్వేన్ బ్రావో తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 2013లో జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టి, ఒకే వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెటర్‌గా జవగల్ శ్రీనాథ్ రికార్డును సమం చేశాడు. 2024 ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాజస్థాన్ రాయల్స్‌పై ఆడిన మ్యాచే అతని చివరి ప్రొఫెషనల్ మ్యాచ్.

Also Read : Typhoon cyberattacks: చైనా చేతిలో అమెరికా రహస్యాలు.. భయంతో వణికిపోతున్న ట్రంప్

Advertisment
తాజా కథనాలు