Putin Strong Warning: ఖబడ్దార్..భారత్, చైనాలో అలా మాట్లాడ్డానికి వీల్లేదు...ట్రంప్ కు పుతిన్ వార్నింగ్

అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో భారత్ కు రషయా మొదటి నుంచీ సపోర్ట్ గా నిలిచింది. తాజాగా మరోసారి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్‌ చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావన్నారు. ట్రంప్ బెదిరింపు మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. 

New Update
Russia President Putin

Russia President Putin

ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఎస్‌సీవో సదస్సు, మిలిటరీ పెరేడ్‌లో పాల్గొనడమే కాక భారత ప్రధాని మోదీతో పాటూ పాకిస్తాన్, ఉత్తర కొరియా అధినేతలతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో కీలక డిస్కషన్స్ నడిచాయి. దాంతో పాటూ పలు ఒప్పందాలను కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో పుతిన్  అమెరికా తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది..

చైనా, భారత్ పట్ల ట్రంప్ తీరును ఎండగట్టారు. ఆసియాలో రెండు అతి పెద్ద శక్తులను అణగదొక్కేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చెడగొట్టే విధంగా మాట్లాడుతున్నారని.. ఇది ట్రంప్ కు ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. అది వారి రాజకీయ జీవితానికే ముప్పని అన్నారు. చైనా, భారత్ రెండూ బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలని...వాటికి ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, చట్టాలున్నాయి. టారిఫ్ ల పేరుతో వారిని ఇబ్బందులు పెడితే తిరగబడతారని చెప్పారు. ఇప్పటికే సుంకాల పేరుతో చాలా టార్చర్ చేశారు. ఇక ఇక్కడితో అన్నీ ఆపేస్తే మంచిదని పుతిన్ అన్నారు. చైనా, భారత్ లను అణగదొక్కేలా ట్రంప్ మాట్లాడ్డం సరైనది కాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి. పరస్పర గౌరవాలు నిలుపుకోవాలని సూచించారు. ప్రపంచంలో నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలు తొందరలోనే ముగుస్తాయని పుతిన్ అన్నారు. మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. 

 ట్రంప్, నవారో నోటి తీట..

భారత్ పై అదనపు సుంకాలను విధించడమే కాకుండా అమెరికా అధ్యక్షుడితో పాటూ ఆ దేశానికి చెందిన మరి కొంత నేతలు, అధికారులు నోరు పారేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గొడవలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ట్రంప్ కూడా వంత పాడుతున్నారు.  తాజాగా వైట్ హౌస్ సలహాదారుడు నవారూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారతదేశంపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లాభాపేక్ష కోసమేనని ఆయన ఆరోపించారు. రష్యా డబ్బును లాండరింగ్ చేయడానికి భారత్ ఒక సాధనంగా మారిందని అన్నారు. దాంతో పాటూ బ్రాహ్మణులు మిగిలిన భారత ప్రజల ఖర్చుతో లాభాలు పొందుతున్నారు. ఇది తక్షణమే ఆపాలని భారత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఆయన భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారు. భారతదేశం సుంకాల విషయంలో అత్యధిక సుంకాలను విధిస్తోందని.. అమెరికా నుంచి వస్తువుల దిగుమతిని అడ్డుకుంటోందని ఆరోపించారు. భారత చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చౌకగా చమురు కొని.. దాన్ని శుద్ధి చేసి అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతున్నాయి. ఈ లాభాలు రష్యాకు యుద్ధానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూర్చడం వల్ల ఈ యుద్ధం మోదీ యుద్ధంగా మారిందని నవారో ఆరోపించారు.

ఇదెలా ఉంటే భారత్ పై సుంకాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మాటి మాటికీ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా ఆ దేశంపై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్సల మోత మోగించలేదని చెప్పుకొచ్చరు ట్రంప్. కేవలం సెకండరీ టారిఫ్ లను మాత్రమే విధించానని...ఇంకా రెండు, మూడు విడతలున్నాయని చెప్పారు. దానికితోడు చైనా, భారత్, బ్రెజిల్ లు అమెరికాను చంపేస్తున్నాయి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Yamuna river Floods: దేశ రాజధానిని ముంచెత్తిన యమున..వరద నీటిలో సచివాలయం

Advertisment
తాజా కథనాలు