Pak PM Shehbaz : మాకు కూడా అదే కావాలి..ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్

నిన్నటి వరకూ తిట్టిన నోరు...ఈరోజు మాత్రం చాలా మంచిగా మారిపోయింది. భారత్ ను ఎప్పుడూ ఆడిపోసుకునే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్‌, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని, వాటిని గౌరవిస్తున్నామని అనడం సంచలనంగా మారింది.

New Update
Pak PM

Pakistan PM Shehbza Sharif with Russian President Vladimir Putin.

చైనాలో రష్యా, భారత్ లు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. అక్కడ జరిగి శిఖరాగ్ర సదస్సులో పాకిస్తాన్ కూడా పాల్గొంది. అయితే ఆ దేశ ప్రధానిని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనబడలేదు. దీంతో భారత్ యే కాదు మేము కూడా ఉన్నామంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, భారత్ సంబంధాలు, ఒప్పందాలతో మాకేం సమస్య లేదు..రెండు దేశాలను గౌరవిస్తున్నామని చెప్పుకొచ్చారు. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ లతో ఆయన వేర్వేరుగా సమావేశం అయ్యారు.  వారితో పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఇందులో భాగంగా భారత్ తో రష్యా మైత్రికి సంబంధించి డిస్కషన్ రాగా...షెహబాజ్ వారి మైత్రిని పొగిడారు. అయితే అదే సమయంలో తాము కూడా మాస్కోతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. తమ దేశ శ్రేయస్సుకు రష్యా సహకారం అవసరం అని అధ్యక్షుడు పుతిన్ కు తెలిపారు.  పుతిన్ డైనమిక్ నేత అని...ఆయనతో కలిసి పని చేయాలని ఉందని షెహబాజ్ చెప్పుకొచ్చారు. 

మీది బావుంది..మాకూ కావాలి...

పాకిస్తాన్ ప్రధాని ఒకవైపు అమెరికాతో సంబంధాలు మెరుగుపర్చుకుంటూనే మరోవైపు భారత్ కు పోటీగా ఇతర దేశాలతో మిత్రత్వం కోసం పోటీ పడుతున్నారు. అయితే అమెరికా, భారత్ ల మధ్యలోకి వచ్చినట్టు కాకుండా..చాలా జాగ్రత్తగా ఇక్కడ అడుగులు వేస్తున్నారు. కర్ర విరగకూడదు, పాము చావాలి అన్నట్టు వ్యవహరిస్తున్నారు.  రష్యా అధ్యక్షుడు దగ్గర భారత్ ను తిడితే అది తమకే తిరిగి వస్తుందని గ్రహించిన షెహబాజ్...చాలా జాగ్రత్తగా భారత్ ను పొగుడుతూ మాట్లాడారు. వారితో రష్యా మైత్రి సూపర్ అంటూనే మాకు కావాలి అంటూ ప్రపోజల్ పెట్టారు. దీని వెనుక పాక్ ప్రధాని షెహబాజ్ మరో భయం కూడా ఉంది. తాజాగా ఇదే ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో ఱస్యా, భారత్ కొత్త రక్షణ ఒప్పందాలను చేసుకున్నాయి. ఇప్పటికే బలంగా ఉన్న తమ దేశ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకు తగ్గట్టు రష్యా ఫైటర్ జెల్ సుఖోయ్ యుద్ధ విమానాలను భారత్ లో తయారు చేయనున్నారు. దీంతో భారత ఆర్మీలోకి అదనపు బలం చేకూరింది. ఇప్పటికే పాకిస్తాన్ కు భారత్ ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు సుఖోయ్ ఫైటర్ జెట్ లు కూడా వాస్తే ఆ దేశం పని అంతే. దీనిని గ్రహించే పాక్ ప్రధాని షెహబాజ్ భారత్ ను ఏమీ అనకుండా..రష్యాతో మైత్రికి తహతమలాడుతున్నారని అంటున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్దగా ఏమీ స్పందించలేదని తెలుస్తోంది. 

Also Read: Afghanistan: రెండు రోజులైనా అవ్వలేదు..ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ భూకంపం

Advertisment
తాజా కథనాలు