German Foreign Minister: భారత పర్యటనలో జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్..ఎందుకొచ్చారంటే..

ప్రపంచ వేదికపై భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్న వేళ జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ భారతదేశ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన ఈ ఉదయం (మంగళవారం) బెంగళూరు చేరుకున్నారు.

New Update
German Foreign Minister Vaudeville

German Foreign Minister Vaudeville

 German Foreign Minister: ప్రపంచ వేదికపై భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్న వేళ జర్మనీ విదేశాంగ మంత్రి  జోహన్ డేవిడ్ వాడేఫుల్ భారతదేశంలో పర్యటిస్తున్నారు.  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఇండియాకు వచ్చారు.రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన ఈ ఉదయం (మంగళవారం) బెంగళూరు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా రేపు వాడేఫుల్ పర్యటన దేశంలో కొనసాగనుంది. ముందుగా ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. బుధవారం (సెప్టెంబర్ 3)న వాడేఫుల్‌  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌ను కలుస్తారు. ఆ తర్వాత న్యూఢిల్లీలోనే విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు అదే రోజు ఆయన జర్మనీకి తిరుగు ప్రయాణమవుతారు.

Also Read : పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

కాగా ఇండియా పర్యటనకు వచ్చే ముందు వాడేఫుల్‌ ఎక్స్ లో కీలక పోస్ట్‌ పెట్టారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, ప్రపంచ వేదికపై భారతదేశం కీలక భాగస్వామిగా పోషిస్తుందని తన పోస్ట్‌ లో పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత పాత్రను వాడేఫుల్ ఈ సందర్భంగా తన ఎక్స్ పోస్టులో వెల్లడించారు. జర్మనీ - భారత్ మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను గురించి ఆయన తన సందేశంలో ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో శక్తివంతమైందని కూడా వాడేఫుల్ స్పష్టం చేశారు. భద్రతా సహకారం, ఆవిష్కరణ, సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి వాటిపై ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత కీలకమని ఆయన తెలియజేశారు. 

Also Read : అయ్యో ట్రంప్ కు ఏమైంది..ఇలా మారిపోయారేంటీ..కలకలం సృష్టిస్తున్న లేటెస్ట్ పిక్స్..

Advertisment
తాజా కథనాలు