PM Shehbaz Sharif : పరువు పోయిందిగా.. పాక్‌ ప్రధానిని పట్టించుకోని మోదీ

చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న SCO శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కలిసి మాట్లాడుతూ ఉండగా షాబాజ్ షరీఫ్ మాత్రం వెనుకాల సెక్యూరిటీ గార్డులాగా నిలుచుని ఉండిపోయారు.

New Update
pak pm

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న SCO శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాన మంత్రి మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కలిసి మాట్లాడుతూ ఉండగా షాబాజ్ షరీఫ్ మాత్రం వెనుకాల సెక్యూరిటీ గార్డులాగా నిలుచుని ఉండిపోయారు. ఒక సందర్భంలో మోడీ, పుతిన్ మాట్లాడుతూ ఆయన ముందే నుంచే నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, షరీఫ్ ఒక మూలన నిలబడి వారిని చూస్తూనే ఉన్నారు. ఎవరూ అతనితో మాట్లాడటం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

వ్లాదిమిర్ పుతిన్ , ప్రధాని మోదీ సహా 20 కి పైగా దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.  పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత షాంఘై సదస్సులో తొలిసారిగా భారత్‌, పాక్‌ ప్రధానులు ఎదురుపడ్డారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను పలకరించలేదు భారత ప్రధాని మోదీ. పాపం షరీఫ్ మాత్రం తనతో ఎవరైనా మాట్లాడుతారేమో అని ఆత్రుతగా చూస్తుడంటం వీడియోలో గమనించవచ్చు.  కాగా నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ షరీఫ్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. 

Also Read :  Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 32 మంది

కీలక పరిణామం

మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ,  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ను  చైనా చావు దెబ్బ కొట్టింది. టెర్రరిజంపై పోరాటంలో భారత్‌కు ఫుల్ సోపోర్ట్‌ గా ఉంటామని చైనా హామీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్‌ టైమ్‌లో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన చైనా..  పాకిస్తాన్‌కు ఫైటర్ జెట్లు, ఆయుధాలు సమకూర్చింది. ట్రంప్‌ - పాకిస్తాన్‌ దోస్తీతో... పాక్‌కు చైనా కటీఫ్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పరిణామాలు వేగంగా మారాయని చెప్పాలి. ట్రంప్‌ను చచ్చిన పాముగా భారత్, చైనా, రష్యా  ట్రీట్ చేస్తున్నాయి. ట్రంప్‌ను లైట్‌ తీసుకున్నాయి బ్రిక్స్ దేశాలు. 

Advertisment
తాజా కథనాలు