Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణకు నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలోని స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించింది.
హైదరాబాద్ లో ఉంటున్న వారికి బిగ్ అలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ కు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 60-100 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 150 మి.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని కరీంనగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది.
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈదురుగాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ నిపుణులు హెచ్చరించారు.