Hyderabad Rains : బిగ్ అలెర్ట్.. హైదరాబాద్లో కుండపోత వర్షాలు!

హైదరాబాద్ లో ఉంటున్న వారికి బిగ్ అలెర్ట్..  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ కు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

New Update
rains

హైదరాబాద్ లో ఉంటున్న వారికి బిగ్ అలెర్ట్..  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ కు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో జులై 27 నుండి జులై 30 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది.  కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడవచ్చని హెచ్చరికలు జారీ చేసింది.  లోతట్టు ప్రాంతాలు, నాలాల పక్కన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.  అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లవద్దని,  పాత భవనాలు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలని సూచించారు.   

మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయంది ఏపీ వాతావరణశాఖ. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జులై 27 ఆదివారం రోజున  కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు అని తెలిపింది. జులై 28 (సోమవారం),  - జులై 29 (మంగళవారం) రోజుల్లో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని... తీర ప్రాంత జిల్లాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.  

Advertisment
తాజా కథనాలు