/rtv/media/media_files/2025/08/16/rains-2025-08-16-09-40-24.jpg)
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం చిత్తడైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ తో సహా నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు పలుజిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also read : TSLPRB: తెలంగాణలో118 APP పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్.. భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం.. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం#Telangana#IMD#WeatherAlert#Weather
— NTV Breaking News (@NTVJustIn) August 16, 2025
భారీ నుంచి అతి భారీ వర్షాలు
ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికారులు ప్రజలను అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులను అప్రమత్తం చేసింది. కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు.
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు
ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోనూ వానలు కురుస్తాయని తెలిపింది.ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. వరద ఉధృతి వల్ల పలు లోతట్టు గ్రామాలు జలమయం అయ్యాయి. విశాఖపట్నం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం మరియు నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు తీరింది. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని వాతావరణ శాఖ కోరింది.
అల్పపీడనం ప్రభావంతో రేపు చెదురుమదురుగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి,విశాఖ జిల్లాల్లో మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 15, 2025