Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజుల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.  రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని  కరీంనగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

New Update

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.  రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని  కరీంనగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.   ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.  గంటకు 30 - 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.  

మరోవైపు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,  ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.  గంటకు 40 - 50 కి.మీ. వేగంతో గాలులు  వీచే అవకాశం ఉందని వెల్లడించింది.  ఈ గాలులకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

అధికారుల హెచ్చరిక

ప్రజలు బయట తిరగకుండా, సుర‌క్షిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల‌ని అధికారులు  సూచిస్తున్నారు. కరెంట్  స్తంభాలు, చెట్లు వంటి వాటి వద్ద నిల్చోవద్దని  అధికారులు సూచించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా అలెర్ట్ అయ్యారు.  ప్లడ్స్ ను ఎదురుకునేందుకు అధికారులకు ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు