Holidays : భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజులు సెలవులు

తెలంగాణకు నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో  విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హన్మకొండ, వరంగల్,  జనగామ, మహబూబాబాద్,  యాదాద్రి జిల్లాలోని స్కూళ్లకు ఇవాళ,  రేపు సెలవు ప్రకటించింది.

New Update
rain holidays

తెలంగాణకు నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో  విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హన్మకొండ, వరంగల్,  జనగామ, మహబూబాబాద్,  యాదాద్రి జిల్లాలోని స్కూళ్లకు ఇవాళ,  రేపు సెలవు ప్రకటించింది. దీంతో ఈ జిల్లాలోని స్కూళ్లకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి.   ఆగస్టు 13,14 సెలవులు కాగా  15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం, 16వ తేదీన  కృష్ణాష్టమి,17వ తేదీన ఆదివారం కానుంది. ఇక హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో ఒకపూట మాత్రమే స్కూళ్లు నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Also read :  మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్

భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేడ్చల్, సైబరాబాద్ పరిధిలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, నదులు, వాగులు, వంకల వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. 

హైదరాబాద్‌లో వర్షాలు

హైదరాబాద్‌లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా  కమిషనర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్ పరిధిలో 10-15 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఇది 20 సెం.మీ వరకు చేరవచ్చని తెలిపారు. దీంతో రోడ్లు జలమయం అయ్యే అవకాశం ఉంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ ఉద్యోగులు వీలైనంత త్వరగా ఇళ్లకు వెళ్లాలని, లేదంటే వర్క్ ఫ్రం హోమ్ (WFH) చేయాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు కోరారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. 

Also Read : ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!

Advertisment
తాజా కథనాలు