Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి.
ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణశాఖ కేంద్రం పేర్కొంది. ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వనపర్తి, నారాయణపేట, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితత్వంతో పసిగట్టే సాంకేతికత రానుంది. ప్రస్తుతం వాడుతున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని 6.8 పెటాఫ్లాప్స్ నుంచి 22 పెటాఫ్లాప్స్కు పెంచారు. అరుణిక, అర్కా అనే సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ త్వరలోనే ప్రారంభించనున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు.
తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.