BREAKING: హిమాచల్ ప్రదేశ్లో గంటలోనే రెండు భారీ భూకంపాలు.. భయంతో పరుగులు
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒకే రోజు రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలను భయాందోళనలకు గురై ఇళ్లలోంచి పరుగులు తీశారు. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3, 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.