Crime: మరో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని వీడియో తీసి ఏం చేశాడంటే!

దేశంలో మరో కోల్‌కతా ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. బిలాస్ పూర్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం జరిగిన ఘటన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
raped

Crime: దేశంలో మరో కోల్‌కతా ఘటన చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. బిలాస్ పూర్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారం జరిగిన ఘటన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన నిందితుడు వివాహం చేసుకుంటానని చెప్పి బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అశ్లీల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయగా ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

బలవంతంగా లైంగిక సంబంధం..

బిలాస్‌పూర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఒక యువతి.. తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ శివ్ చౌదరి తెలిపారు. దాదాపు నెలన్నర క్రితం నిందితుడు ఆమెను చండీగఢ్‌కు ఆహ్వానించి కలవమని చెప్పాడు. అక్కడ ఒక హోటల్‌లో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ దారుణమైన చర్యను సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆ తర్వాత బాధితురాలిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో యువతి బిలాస్‌పూర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసినట్లు ASP తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు. ఈ కేసులోని అన్ని కోణాల్లో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్యాప్తు నివేదిక, ఆధారాల ఆధారంగా నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూసేందుకు అతనిపై బలమైన ఛార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు.

Also Read :  లిరిక్స్‌తో ఆకట్టుకున్న ఏమి మాయ ప్రేమలోన సాంగ్.. ప్రేక్షకులను మాయలోకి దించుతున్న మ్యూజిక్

ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా ఏటుకూరులో దారుణం జరిగింది.  చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడో అన్న.  పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేశ్‌. చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్స్‌తో కలిసి.. నడిరోడ్డుపైనే గణేశ్‌ ప్రాణాలు తీశాడు యువతి సోదరుడు.  విచక్షణరహితంగా గణేశ్‌ పై దాడి చేసి ప్రాణం తీశారు ముగ్గురు యువకులు.  పెళ్లి తరువాత రక్షణ కోరుతూ గతంలో గుంటూరులోని నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు గణేష్. అప్పట్లో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి మాట్లాడారు. అయితే అంత సద్దుమణిగిందని అనుకున్న టైమ్ లో తమ కుమారుడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారని గణేశ్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read :  ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?

Advertisment
తాజా కథనాలు