Himachal Pradesh: అయ్యో దేవుడా.. డైలాగ్ చెబుతూ లైవ్‌లోనే ఫేమస్ నటుడు మృతి.. అసలేమైందంటే?

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో రాముడి తండ్రి దశరథుడిగా 73 ఏళ్ల నటుడు అమ్రేష్ మహాజన్ నటిస్తున్నాడు. ఈ క్రమంలో రాంలీలా సన్నివేశం నటిస్తుండగా ఆ నటుడు వేదికపైనే మరణించాడు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు రావడంతో డైలాగ్ చెబుతూ స్పాట్‌లోనే మృతి చెందాడు.

New Update
Himachal pradesh

Himachal pradesh

నేటి కాలంలో గుండె పోటుతో అకస్మా్త్తుగా మృతి చెందారు. చిన్న, పెద్ద అనే సంబంధం లేకుండా చాలా మంది చనిపోతున్నారు. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో ఓ 73 ఏళ్ల నటుడు డైలాగ్ చెబుతూనే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో రాముడి తండ్రి దశరథుడిగా 73 ఏళ్ల నటుడు అమ్రేష్ మహాజన్ నటిస్తున్నాడు. ఈ క్రమంలో రాంలీలా సన్నివేశం నటిస్తుండగా ఆ నటుడు వేదికపైనే మరణించాడు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు రావడంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. మంగళవారం రాత్రి 1:30 గంటల ప్రాంతంలో చంబ చౌగన్ మైదానంలో రాంలీలా ప్రదర్శన జరుగుతోంది. రాంలీలా రెండవ రోజు సీతా స్వయంవరం జరగాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Zubeen Garg funeral: అస్సామీ సింగర్ అంత్యక్రియలకు ప్ర‌పంచ రికార్డ్

డైలాగ్ చెబుతూ అకస్మాత్తుగా మృతి..

నటులందరూ తమ సంభాషణలు చెబుతుండగా, అకస్మాత్తుగా దశరథుడిగా నటిస్తున్న సీనియర్ నటుడు అమ్రేష్ మహాజన్ (73) తన సహచరుడి భుజంపైకి వాలిపోయాడు. డైలాగ్ చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మిగతా నటులు అతను నటిస్తున్నాడు ఏమోనని సైలెంట్ ఉన్నారు. చివరకు నటుడు స్పృహ కోల్పోయాడని గ్రహించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మొఘల మొహల్లాకు చెందిన ఇతను గత 40 సంవత్సరాలుగా చారిత్రాత్మక చౌగన్‌లో జరిగే శ్రీరామలీలాలో పాల్గొంటున్నాడు. ఇతను రామ్‌లీలాలో దశరథుడు, రావణుడి పాత్రలను పోషిస్తున్నాడు. ఇలా నటిస్తూనే గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, తోటి నటులు బాధపడుతున్నారు. 

ఇది కూడా చూడండి: Crime News : శృంగేరి పీఠం బ్రాంచ్‌లో దారుణం..17 మంది విద్యార్థులను స్వామీజీ ఏం చేశాడంటే..

Advertisment
తాజా కథనాలు