Artificial Snow Fields: మంచు కురవట్లేదని.. టూరిస్టుల కోసం ఏం చేశారో తెలుసా?

శీతాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకుల కళ్లు హిమాలయాల వైపు మళ్లుతాయి. హిమపాతాన్ని చూసి మురిసిపోవాలని వేలాది మంది హిమాచల్ ప్రదేశ్‌కు క్యూ కడతారు. అయితే, ఈ ఏడాది ప్రకృతి కరుణించకపోవడంతో పర్యాటకుల ఆశలు అడియాశలయ్యాయి.

New Update
Artificial Snow Field

శీతాకాలం వచ్చిందంటే చాలు పర్యాటకుల(tourists) కళ్లు హిమాలయాల వైపు మళ్లుతాయి. మంచుతో కప్పబడిన కొండలు, ఆకాశం నుంచి రాలే హిమపాతాన్ని(snowfall) చూసి మురిసిపోవాలని వేలాది మంది హిమాచల్ ప్రదేశ్‌కు క్యూ కడతారు. అయితే, ఈ ఏడాది ప్రకృతి కరుణించకపోవడంతో పర్యాటకుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో పర్యాటకులను నిరాశపరచకుండా ఉండేందుకు స్థానిక వ్యాపారులు, పర్యాటక సంస్థలు ఆర్టిఫిషియల్ స్నో ఫీల్డ్(Artificial Snow Fields) ఏర్పాటు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎందుకు ఈ కృత్రిమ మంచు?

సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో హిమాచల్‌(Himachal Pradesh) లో భారీగా హిమపాతం కురుస్తుంది. కానీ ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా అటల్ టన్నెల్, మనాలి వంటి కీలక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో మంచు కురవలేదు. పర్వతాలు బోసిపోయి కనిపిస్తుండటంతో పర్యాటక రంగం కుదేలయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో పర్యాటకులకు మంచు అనుభూతిని అందించేందుకు లాహౌల్ లోయలోని వ్యాపారులు ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.

Also Read :  బురఖా ధరించలేదని భార్యాబిడ్డలను దారుణ హత్య.. ఆధార్ కార్డు కూడా!

జీపుల్లో మంచు తరలింపు.. క్షేత్రాల ఏర్పాటు

ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట మిగిలి ఉన్న సహజ మంచును స్థానికులు జీపులు, ట్రక్కుల ద్వారా తరలిస్తున్నారు. రోడ్డు మార్గానికి దగ్గరగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఈ మంచును కుప్పలుగా పోసి, చిన్నపాటి మంచు క్షేత్రాలు సృష్టిస్తున్నారు. ఈ కృత్రిమ క్షేత్రాలలో పర్యాటకులు స్కీయింగ్ చేయడం, ఫోటోలు దిగడం, మంచుతో ఆడుకోవడం వంటివి చేస్తున్నారు. కొన్ని చోట్ల 'స్నో గన్' వంటి పరికరాలను ఉపయోగించి నీరు, గాలి సాయంతో కృత్రిమ మంచును కూడా తయారు చేస్తున్నారు. - national news in Telugu

Also Read :  భారత్‌-ఒమన్‌ మధ్య కీలక ఒప్పందం

సోషల్ మీడియాలో 'స్నో స్కామ్' చర్చ

అయితే, ఈ కృత్రిమ మంచుపై సోషల్ మీడియా(Social Media) లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఒక పర్యాటకురాలు మనాలి సమీపంలో ఎండిపోయిన కొండల మధ్య కేవలం ఓ చిన్న ప్యాచ్‌లో మాత్రమే మంచు ఉండటాన్ని వీడియో తీసి "స్నో స్కామ్" అంటూ పోస్ట్ చేసింది. "బయట ఎక్కడా మంచు లేదు, కేవలం పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఇలా ట్రక్కులతో మంచు తెచ్చి ఇక్కడ పోస్తున్నారు" అని ఆమె ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
 
స్థానిక వ్యాపారులు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. "ఇది మోసం కాదు, పర్యాటకుల సౌకర్యం కోసం చేస్తున్న ఏర్పాట్లు. అందరూ ఎత్తయిన రోహ్‌తంగ్ పాస్ లేదా షింకులా పాస్ వరకు వెళ్లలేరు. కాబట్టి అందుబాటులో ఉన్న చోట మంచును ఏర్పాటు చేస్తున్నాం" అని వారు చెబుతున్నారు. సహజ హిమపాతం కురిసే వరకు పర్యాటక రంగాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక తాత్కాలిక మార్గమని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి పర్యాటకులు ఈ కృత్రిమ మంచుతోనే సరిపెట్టుకుంటున్నారు. క్రిస్మస్ మరియు కొత్త ఏడాది నాటికి ప్రకృతి మంచు కురుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు