/rtv/media/media_files/2026/01/09/fotojet-15-2026-01-09-20-35-36.jpg)
Tourist bus falls into valley
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు టూరిస్టు బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తు్న్న 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కుప్వి నుంచి రాజధాని నగరం సిమ్లాకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Himachal Pradesh: Eight people died in a bus accident after a private bus enroute from Kupvi to Shimla rolled down the road near Haripurdhar in Sirmaur district. https://t.co/iQ3fz7vn70pic.twitter.com/CcX6ZzR8ec
— ANI (@ANI) January 9, 2026
స్థానిక పోలీసు వర్గాల సమాచారం ప్రకారం హరిపుర్దార్ ఏరియాలోని ఇరుకైన రహదారి గుండా బస్సు వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు సిర్మూర్ ఎస్పీ నిశ్చింత్ సింగ్ నెగి తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే తొలుత స్థానికులు స్పందించారు. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న వారు అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకోకముందే సహాయక చర్యలు చేపట్టారు. పలువురు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా గాయపడిన వారిలో మరికొందరికి సీరియస్‌గా ఉండటంతో హెయర్ మెడికల్ సెంటర్లకు తరలించినట్లు నిశ్చింత్ సింగ్ చెప్పారు.
కాగా, ఈ ఘటనపై రాష్ర్ట ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ సుఖు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్టు ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
Follow Us