BJP MLA : బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్లు!

చురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హిమాచల్ ప్రదేశ్‌ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్ రాజ్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌తో పాటు మైనర్ బాలికలపై లైంగిక దాడుల నుంచి రక్షించే చట్టం కింద కేసు నమోదైంది.

New Update
bjp mla

చురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హిమాచల్ ప్రదేశ్‌ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్ రాజ్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌తో పాటు మైనర్ బాలికలపై లైంగిక దాడుల నుంచి రక్షించే చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. హన్స్ రాజ్‌పై రేప్ (376), కిడ్నాప్ (363), నేరపూరిత బెదిరింపు (506), POCSO చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన బాధితురాలు, సంఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని చెప్పుకుంది. గత ఏడాది ప్రారంభంలో ఎమ్మెల్యే అశ్లీల సందేశాలు పంపారని, నగ్న ఫోటోలు డిమాండ్ చేశారని ఆ బాలిక ఆరోపించింది. దీనిపై పోలీసు ఫిర్యాదు నమోదు చేశారు.

తనను బలవంతంగా సిమ్లాకు

అయితే ఈ ఏడాది నవంబర్ 2న మైనర్ బాలిక సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఎమ్మెల్యే తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అధికారులు తన తండ్రిని వేధిస్తున్నారని, ఎమ్మెల్యే సహచరులు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని కూడా ఆమె ఆరోపించింది. ఎమ్మెల్యే హన్స్ రాజ్, అతని సహచరులు గత ఏడాది తన కుమార్తెను,  తనను బలవంతంగా సిమ్లాకు తీసుకెళ్లారని, వారి తమ మొబైల్ ఫోన్‌లను లాక్కుని, తన కుమార్తెను బెదిరించి, ప్రజలను,  అధికారులను తప్పుదారి పట్టించే లక్ష్యంతో స్క్రిప్ట్ చేసి వీడియోను రికార్డ్ చేయమని బలవంతం చేశారని ఆ మహిళ తండ్రి తన ఫిర్యాదులో ఆరోపించారు.

అయితే చురా ఎమ్మెల్యే ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, అవి రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని చెబుతున్నారు. ఆ మహిళ ఆ ప్రాంతంలో మత ఉద్రిక్తతను రేకెత్తిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్ చంబా పోలీసు సూపరింటెండెంట్ నుండి నివేదిక కోరింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఈ ఆరోపణలు హన్స్ రాజ్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు