Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ మంచు.. 1200పైగా రోడ్లు మూసివేత

గత కొన్ని రోజుల నుంచి ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు పర్వతాలన్నీ తెల్లటి మంచు దుప్పటితో కప్పి ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో 1200కు పైగా రోడ్లు మూసివేశారు.

New Update
FotoJet (12)

Himachal pradesh

గత కొన్ని రోజుల నుంచి ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు పర్వతాలన్నీ తెల్లటి మంచు దుప్పటితో కప్పి ఉన్నాయి. మంచు ఎక్కువగా పడటంతో దీన్ని చూడటానికి పర్యాటకులు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో 1200కు పైగా రోడ్లు మూసివేశారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని ఔలి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir) లోని మనాలి వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది. అన్ని పర్యాటక ప్రదేశాలు మంచు(snow-fall-effects)తో కప్పబడి ఉన్నాయి. విపరీతమైన చలి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

భారీ హిమపాతంతో పాటు వర్షాలు..

భారీ హిమపాతం వల్ల పర్యాటక రంగానికి ఆటంకం ఏర్పడింది. మంచు అధికంగా కురుస్తుండటంతో రోడ్లపై వాహనాలు ఉండిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి ప్రయాణికులు ఆ మంచులోనే రోడ్లపైన వెయిట్ చేస్తున్నారు. కేవలం రవాణాకు మాత్రమే కాకుండా విద్యుత్, నీటి సరఫరాకు కూడా తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే హిమపాతంతో పాటు వర్షాలు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు జమ్మూకశ్మీర్‌లో కూడా వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

Also Read: H-1B Visa: హెచ్ 1బీ వీసా దరఖాస్తులను ఆపేయండి..టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు