Kangana Ranaut: కంగనాని చెంపదెబ్బ కొట్టాలి.. ప్రాణాలు పోతుంటే పైసలు రావట్లేదని ఆవేదనా!

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై తమిళనాడు సీనియర్ కాంగ్రెస్ నేత కేఎస్ అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ దక్షిణాదికి వస్తే ఆమెని చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి.

New Update
kangana news

బాలీవుడ్ నటి, బీజేపీ(bjp) ఎంపీ కంగనా రనౌత్‌(kangana-ranaut) నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) లో ఇటీవల సంభవించిన వరదలు, కొండచరియలతో ఆర్థిక నష్టాలపై కంగనా రనౌత్ గురువారం విచారం వ్యక్తం చేశారు. తన సొంత లోక్‌సభ నియోజకవర్గం మండిలో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడారు. ఈక్రమంలో ఆమె తన రెస్టారెంట్‌కు రోజు కేవలం రూ.50 ఆదాయం మాత్రమే వస్తుందన్నారు. అందులో పని చేసే ఉద్యోగుల నెల జీతాలు రూ.15 లక్షలు అని ఓ మహిళతో కంగనా చెప్పుకొచ్చారు.

Also Read :  భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. ఎంతంటే?

Congress Leader Wants To Slap Kangana Ranaut

ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మనాలిలో 'కంగనా, నువ్వు ఆలస్యం అయ్యావు' అనే నినాదాలతో స్వాగతం పలికారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనేక వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి, అక్కడ స్థానికులు నల్ల జెండాలు పట్టుకుని, మండి ఎంపీ కార్కేడ్ దగ్గర నినాదాలు చేస్తున్నారు.

అంతేకాదు తమిళనాడు సీనియర్ కాంగ్రెస్ నేత కేఎస్ అళగిరి కూడా ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ దక్షిణాదికి వస్తే ఆమెని చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. సోషల్ మీడియాలో ఆయన కామెంట్లు వైరల్‌గా మారాయి.

ఈ వివాదం కంగనా రనౌత్ గతంలో రైతుల నిరసనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తలెత్తింది. రైతుల నిరసనల సమయంలో ఓ వృద్ధ మహిళా రైతు గురించి కంగనా మాట్లాడుతూ.. అలాంటి మహిళలకు రూ.100 ఇస్తే నిరసనల్లో పాల్గొంటారని ఆమె అన్నారు. అది పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సమయంలో ఒక మహిళా సీఐఎస్ఎఫ్ సిబ్బంది కంగనాను చెంపదెబ్బ కొట్టిన ఘటనను కూడా అళగిరి గుర్తు చేశారు. రైతుల గురించి అవమానకరంగా మాట్లాడినందుకే ఆమె అలా చేసిందని అళగిరి అన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ గురించి ప్రశ్నించగా, కేఎస్ అళగిరి తీవ్రంగా స్పందించారు. "కంగనా చాలా అహంకారంతో మాట్లాడుతుంది. ఆమె దక్షిణాదికి వస్తే, ఆమెను మరిచిపోకుండా చెంపదెబ్బ కొట్టాలి. అప్పుడే ఆమెకు తప్పు తెలిసివస్తుంది" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. కంగనా నిత్యం అహంకారపూరితంగా మాట్లాడుతుందని.. ఆమె అటువంటి వైఖరిని మానుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేత సూచించారు.

అళగిరి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఓ మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో దిగజారుతున్న నైతిక విలువలకు నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శించారు. అయితే, కంగనా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇలాంటి బెదిరింపులను తాను పట్టించుకోనని, ఇది రాజకీయంగా తమ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టం చేస్తుందని పేర్కొంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.

Also Read :  ఉద్యోగులకు Microsoft బిగ్ షాక్.. అలా చేస్తే మీ ఉద్యోగం ఔట్!

Advertisment
తాజా కథనాలు