Soldiers : హ్యాట్సాఫ్.. యుద్ధంలో అన్న వీరమరణం...చెల్లికి దగ్గరుండి పెళ్లి చేసిన తోటి సైనికులు!

సైనిక ఆపరేషన్ లో జవాను అయిన అన్నను కోల్పోయిన ఓ యువతికి ఆయన సహచర సైనికులే సోదరులుగా మారారు. అన్న లేని లోటును తీరుస్తూ ఆ యువతికి దగ్గరుండి ఘనంగా పెళ్లి చేయించారు.

New Update
indian army

సైనిక ఆపరేషన్ లో జవాను(Indian Army) అయిన అన్నను కోల్పోయిన ఓ యువతికి ఆయన సహచర సైనికులే సోదరులుగా మారారు. అన్న లేని లోటును తీరుస్తూ ఆ యువతికి దగ్గరుండి ఘనంగా పెళ్లి చేయించారు. ఈ కమనీయ వేడుక హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లో జరిగింది. ఫిబ్రవరి 2024లో ఆపరేషన్ అలర్ట్ సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆశిష్ కుమార్ యుద్ధంలో మరణించాడు. అయితే అతని సోదరి ఆరాధనకు ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది. ఆశిష్ కుమార్ సోదరి వివాహ బాధ్యతలను భారత సైన్యంలోని సహచర జవాన్లు, మాజీ సైనికులు తమ భుజాలపై వేసుకున్నారు.

Also Read :  చొక్కా పట్టుకుని.. నడి రోడ్డు మీద.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం

పెళ్లికూతురిని గ్రాండ్‌గా

ఆమెకు అన్నలేని లోటను దగ్గరుండి తీర్చారు. ఆశిష్ కుమార్ తరపున, ఈ సైనికుల బృందం పెళ్లికూతురిని గ్రాండ్‌గా, అలంకరించిన రథంలో వివాహ మండపానికి తోడ్కొని వచ్చారు. ఈ తంతు అంతా ఓ అన్నదమ్ములు చేయాల్సిన బాధ్యతగా వారు నిర్వహించారు. సోదరుడి తరపున, సైనికులంతా కలిసి పెళ్లికూతురుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ను బహుమతిగా ఇచ్చి, నూతన దంపతులు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. వివాహం తర్వాత, అత్తగారింటికి పంపే సమయంలో కూడా సోదరుడి పాత్రను సైనికులే పోషించారు. 

ఈ ఘటనను చూసిన పెళ్లికి వచ్చిన అతిథులు మరియు వధువు అత్తమామలు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ కుటుంబానికి సైన్యం చూపిన ఈ అపూర్వమైన గౌరవం, బాధ్యతకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాయి. సైనికులు తమ సహచరుడి సోదరి పట్ల చూపిన ఈ ప్రేమాభిమానం, సైన్యంలో ఉండే కుటుంబ బంధాన్ని, బాధ్యతను లోకానికి చాటిచెప్పింది.

Also Read :  ‘నీ నగ్న ఫొటోలు పంపు’.. బాలీవుడ్ హీరో కూతురికి మెసేజ్‌లు

ఇదే కాకుండా గతంలో కూడా సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన శైలేంద్ర ప్రతాప్ సింగ్ చెల్లెలి పెళ్లికి వచ్చి సోదరుడి బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఐఏఎఫ్ (IAF) కమాండో జ్యోతి ప్రకాష్ నిరాలా చెల్లెలి పెళ్లిలో దాదాపు 50 మంది కమాండోలు సోదరులుగా పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు సైనికుల మధ్య బంధాన్ని, అమరవీరుల కుటుంబాలకు దేశం ఇచ్చే గౌరవాన్ని చాటి చెబుతాయి. 

Advertisment
తాజా కథనాలు