YCPకి దెబ్బ మీద దెబ్బ.. పులివెందుల ZPTC ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు!
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో రీపోలింగ్ నిర్వహించాలని YCP దాఖలు చేసిన పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది.