Big breaking : టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట.. సింగిల్‌ బెంచ్ తీర్పు రద్దు చేసిన డివిజన్‌ బెంచ్‌!

గ్రూపు -1 పరీక్షల విషయంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు టీజీపీఎస్‌కీ హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. తదుపరి తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోవాలని కోరింది.

New Update
TGPSC

TGPSC : గ్రూపు -1 పరీక్షల విషయంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు టీజీపీఎస్‌కీ హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. తదుపరి తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోవాలని కోరింది.తదుపరి విచారణ వచ్చేనెల 15కు వాయిదా వేసింది. గ్రూప్‌-1 తుది మార్కుల జాబితా, జనరల్‌ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు విచారణ చేపట్టింది.

తెలంగాణ గ్రూప్ 1పై టీజీపీఎస్‌సీ అప్పీల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే గ్రూప్‌-1 ఫలితాలపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును టీజీపీఎస్‌సీ అప్పీల్‌ చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం తరఫున హైకోర్టులో ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. రీ వాల్యుయేషన్‌ సర్వీస్‌ నిబంధనల ఆధారంగా ఉండాలని ఏజీ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరిగాయని ఈ సందర్బంగా తెలంగాణ హైకోర్టు దృష్టికి ఏజీ తీసుకువెళ్లారు.

గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులోని సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఈ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేకుంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కీలక తీర్పు వెలువరించిన విషయం విదితమే. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) నిర్ణయించింది. అందులోభాగం దీనిపై తెలంగాణ హైకోర్టును టీజీపీఎస్‌సీ ఆశ్రయించింది. దీంతో బెంచ్ ఈ ప్రస్తుత తీర్పునచ్చింది.

Advertisment
తాజా కథనాలు