BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై బిగ్‌ ట్విస్ట్.. విచారణ వాయిదా

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో బిగ్‌ ట్విస్టు నెలకొంది. దీనిపై విచారించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. 

New Update
High Court

High Court

బీసీ రిజర్వేషన్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బిగ్‌ ట్విస్టు నెలకొంది. దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. రేపు మరిన్ని వాదనాలు వినిపిస్తామని ఏజీ వెల్లడించారు. రేపటి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. 

Also Read: రేవంత్ సర్కార్ కు బిగ్ రిలీఫ్.. రేపే స్థానిక సంస్థల నోటిఫికేషన్!

బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పలు కీలక వాదనలు చేశారు. '' దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లును సమర్థించాయి. ఇక్కడ- చట్టాన్ని ఎవరూ సవాలు చేయలేదు. చట్టం ఆధారంగా జారీ చేసిన GOలను మాత్రమే సవాలు చేశారు.- జీవోలకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం అనేది కుదరదు. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు మాత్రమే చెప్పింది. రాజ్యాంగంలో మాత్రం రిజర్వేషన్లపై ఎక్కడా కూడా ఎలాంటి పరిమితి అనేది లేదు. డేటా ఆధారంగా ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. 

Also Read: 15ఏళ్ల బాలికతో వ్యభిచారం.. సినీ నటుడు సహా ఐదుగురు అరెస్టు

2018లో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం ఆమోదించినప్పుడు దీనిపై కసరత్తు జరగలేదు. 2019లో EWS సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. దీని- ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటి అదనంగా 10 శాతం చేరుకుంది. దీన్ని బట్టి ఇప్పటికే రిజర్వేషన్ల శాతం 60 శాతానికి చేరుకుంది. ఎంపిరికల్ డేటా అనేది ఉంటే గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు.- గవర్నర్‌కి ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించలేదు.. అలాగని వెనక్కి కూడా పంపలేదు. బిల్లు పంపి ఆరు నెలలు గడిచిన ఎలాంటి స్పందన లేదు. బిల్లులు పాస్ చేసే విషయంలో చట్ట సభల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈ బిల్లును  అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదించాయని''  అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. 

Also Read: పాతబస్తీలో దారుణం..సాంత్వన చేకూర్చుతానని..సొంతం చేసుకున్న ఫేక్‌ బాబా

మరోవైపు పిటిషనర్‌ తరఫున న్యాయవాది బుచ్చిబాబు కూడా కోర్టులో కీలక వాదనలు చేశారు. ట్రిపుల్ టెస్టు లేకుండా రిజర్వేషన్లను పెంచడం సాధ్యం కాదన్నారు. 2021లో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ప్రస్తావించారు. ''బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. కేవలం షెడ్యూల్‌ మాత్రమే విడుదల చేశారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామని'' వాదనలు వినిపించారు.

Advertisment
తాజా కథనాలు