Telangana: భార్య వంట చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భార్య వంట చేసే విషయానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు భార్య వంట చేయకపోవడం, తల్లికి సహకరించడం లేదనే కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

New Update
High Court

High Court


తెలంగాణ హైకోర్టులో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భార్య వంట చేసే విషయానికి సంబంధించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు భార్య వంట చేయకపోవడం, తల్లికి సహకరించడం లేదనే కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య వల్ల హింసకు గురవుతున్నాని కింది కోర్టును ఆశ్రయించాడు. తామిద్దరం ఉద్యోగాలు చేస్తున్నామని.. భార్య వంట చేయడం లేదని, తల్లికి సహకరించడం లేదని పేర్కొన్నాడు. తమ వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.

Also Read: భారత్‌లో తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

కింది కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా దీనిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 వరకు డ్యూటీలో ఉండగా.. భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉంటున్నారని తెలిపింది. ఇలాంటప్పుడు భార్య వంట చేయలేదనే కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంది. పెళ్లి తర్వాత ఆమెకు అబార్షన్ కావడంతో తల్లిదండ్రుల వద్ద ఉండటం క్రూరత్వం కాదని చెప్పింది. 

Also Read: గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడమే టార్గెట్‌.. అవసరమైతే మిలటరీని దింపుతాం: ట్రంప్

అయితే వేరు కాపురం పెడితే క్రూరత్వం కిందకి వస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందని.. కానీ ఇది కూడా పలు కేసుల్లో వాస్తవాల ఆధారంగానే వర్తిస్తుందని వెల్లడించింది. ఈ కేసులో చూసుకుంటే భార్య వేరే కాపురం ప్రతిపాదన చేయలేదని, ఆమె తరఫు న్యాయవాది మాత్రమే సలహా ఇచ్చారని తెలిపింది. అందువల్ల దీన్ని క్రూరత్వంగా పరిగణించలేమని చెప్పింది. విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. 

Advertisment
తాజా కథనాలు