Sridevi-Boney Kapoor: శ్రీదేవి ఆస్తి కోసం కోర్టుకెక్కిన బోనీ కపూర్.. అసలు వివాదం ఏంటి?

దివంగత సినీ తార, అతిలోక సుందరి శ్రీదేవికి చెందిన చెన్నైలోని ఆస్తి వివాదంలో చిక్కుకుంది. చెన్నైలోని ఆమె ఆస్తిపై ముగ్గురు వ్యక్తులు అక్రమంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారంటూ ఆమె భర్త ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

New Update
Sridevi-Boney Kapoor

Sridevi-Boney Kapoor

Sridevi-Boney Kapoor :  దివంగత సినీ తార, అతిలోక సుందరి శ్రీదేవికి చెందిన చెన్నైలోని ఆస్తి వివాదంలో చిక్కుకుంది. చెన్నైలోని ఆమె ఆస్తిపై ముగ్గురు వ్యక్తులు అక్రమంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారంటూ ఆమె భర్త ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురు వేసిన దావా చట్టవిరుద్దమని, మోసపూరితమైందని ఆయన ఆరోపించారు. వారి వాదనలను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఈసీఆర్)లో ఉన్న ఈ ఆస్తిని కపూర్ కుటుంబం తమ ఫామ్‌హౌస్‌గా ఉపయోగించుకుంటోంది.

బోనీ కపూర్ హైకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, శ్రీదేవి చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లోని స్థిరాస్తిని 1988 ఏప్రిల్ 19న ఎం.సి. సంబంధ మొదలియార్ అనే వ్యక్తి నుంచి చట్టబద్ధంగా కొన్నారు. దానికి సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించిన తర్వాతే ఆమె ఆస్తిని కొనుగోలు చేసినట్లు బోనీ కపూర్‌ వివరించారు. ఆస్తి అమ్మిన వ్యక్తికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వారందరి దగ్గర వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాతనే శ్రీదేవి ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్లు బోనీ కపూర్‌ వెల్లడించారు. అయితే, ఇటీవల ముగ్గురు వ్యక్తులు తెరపైకి వచ్చి తామే ఆ ఆస్తికి అసలైన వారసులమని వాదిస్తు్న్నారు. వారిలో ఒక మహిళ, తాను మొదలియార్ రెండో భార్యనని, మిగిలిన ఇద్దరు తన కుమారులని చెబుతున్నారు.  ఈ ఆస్తిలో వారికి వాటా ఉందంటూ తహశీల్దార్‌ కార్యాలయంలో అప్పీల్‌ చేశారన్నారు.  స్థానిక ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో  చట్టవిరుద్ధంగా ఆ స్థిరాస్తి హక్కులను సొంతం చేసుకున్నారని బోనీ కపూర్‌ హైకోర్టులో కేసు వేశారు.  మొదలియార్ మొదటి భార్య 1999 జూన్ 24న మరణించారని, కానీ ఈ మహిళతో ఆయనకు 1975 ఫిబ్రవరి 5నే వివాహం జరిగిందని వారు క్లెయిమ్ చేస్తున్నారని బోనీ కపూర్ వివరించారు. మొదటి భార్య జీవించి ఉండగా చేసుకున్న రెండో వివాహం చట్టప్రకారం చెల్లదని, కాబట్టి వారికి వారసత్వ హక్కులు వర్తించవని ఆయన స్పష్టం చేశారు.

 మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.  శ్రీదేవి ఎంతో కష్టపడి ఆ స్థిరాస్తిని కొనుగోలు చేసిందని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కోరారు.
విచారించిన జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని.. ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తాంబరం తాలూకా తహసీల్దార్‌ను ఆదేశించారు.  ఈ వివాదంలో మరో కీలకమైన అంశం లీగల్ హీర్‌షిప్ సర్టిఫికెట్ (చట్టబద్ధ వారసత్వం). ఆ ముగ్గురు వ్యక్తులకు రెవెన్యూ అధికారి జారీ చేసిన వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కూడా బోనీ కపూర్ సవాలు చేశారు. ఆ సర్టిఫికెట్‌ను జారీ చేసే అధికారం సంబంధిత అధికారికి లేదని, దానిని తక్షణమే రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. 1960 ఫిబ్రవరిలోనే మొదలియార్ కుటుంబంలో ఆస్తి పంపకాల ఒప్పందం జరిగిందని, దాని ఆధారంగానే శ్రీదేవి ఆస్తిని కొనుగోలు చేశారని, కాబట్టి ప్రస్తుత దావాలకు చట్టబద్ధత లేదని ఆయన వాదించారు.

బోనీ కపూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్, ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి నాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్‌ను ఆదేశించారు. 1996లో శ్రీదేవిని వివాహం చేసుకున్న బోనీ కపూర్, ఆమె 2018లో మరణించిన తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలను, ఆస్తులను కాపాడుకుంటున్నారు. వారి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ప్రస్తుతం సినీ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఆస్తిని కాపాడుకోవడానికి బోనీ కపూర్ చేస్తున్న న్యాయపోరాటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: కేంద్ర మాజీ మంత్రి హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Advertisment
తాజా కథనాలు