/rtv/media/media_files/2025/01/03/1NScfhfb0KOmX4y7IzEl.jpg)
TGPSC
గ్రూప్ 1 విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1పై అప్పీల్‌కు వెళ్లాలని TGPSC నిర్ణయించింది. ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో ఈ డెసిషన్ తీసుకున్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మళ్ళీ పరీక్షలు నిర్వహించండి..
గ్రూప్ 1 కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీని కోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ ను రద్దు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. అలాగే మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. ఒక వేళ మూల్యంకనం సాధ్యం కాకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం టీజీపీఎస్సీని ఆదేశించింది. మ్యూలంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. దీనిపై విచారించిన కోర్టు పరీక్షలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గ్రూపు 1 మెయిన్స్ మెరిట్ లిస్టును కోర్టు రద్దు చేసింది. తిరిగి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్‌సీని ఆదేశించింది.
చుక్కలు చూపిస్తున్న టీజీపీఎస్సీ..
గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ చుక్కలు చూపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరీక్షలకు 2011లో చివరి నోటిఫికేషన్ పడింది. ఆ తర్వాత మళ్ళీ 11 ఏళ్లకు 2022లో ప్రత్యేక రాష్ట్రంలో తొలి నోటిఫికేషన్ ఇచ్చారు. 503 పోస్టులకు నోటిఫికేషన్ వేయగా..మొత్తం 3.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రిలిమ్స్ కు 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పేపర్ లీక్ కారణంగా 2023 మార్చిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. తర్వాత జూన్ లో మరోసారి ప్రిలిమ్స్ ను నిర్వహించారు. వీటిని బయోమెట్రిక్ పద్దతిని పాటించలేదని సెప్టెంబర్ లో మరోసారి హైకోర్టు రద్దు చేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఎన్నికలు రాడం..బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడం కూడా గ్రూప్-1 పరీక్షలపై ఎఫెక్ట్ చూపించింది. దీని తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి..గ్రూప్-1 పాత నోటిఫికేషన్ ను రద్దు చేసింది. టీజీపీఎస్సీ ప్రక్షాళన కోసం UPSCని స్వయంగా సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా అయిన తర్వాత పాత వాటికి మరో 60 పోస్టులు కలిపి 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్.. ఏడాది మార్చి 30న రిజల్ట్స్అంటూఅనౌన్స్ చేసింది. అనుకున్న ప్రకారమే అన్నీ జరిగాయి.
రిజల్ట్స్ వచ్చాయి.. ప్రిలిమ్స్ బాగానే అయిపోయినా.. మళ్ళీ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి అడ్డుకట్ట పడిపోయింది. ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును రద్దు చేయాలని తీర్పును వెలువరించింది. మూల్యాంకనంజరిగిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు.. మళ్లీ వాల్యుయేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు ఒక రీతిగా మూల్యాంకన విధానం ఒకేరీతిలోజరగలేదన్నన్యాయస్థానం..ఇది అసమానతకు దారి తీస్తుందని, రాజ్యాంగ హకులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యచేసింది. దాంతోపాటూకోచింగ్సెంటర్ఫ్యాకల్టీతోజవాబుపత్రాలుదిద్దించడంపైఆగ్రహంవ్యక్తంచేసింది. 719 మందిఅభ్యర్థులకుఒకటేమార్కులురావడంపైఆశ్చర్యంప్రకటించిందికోర్టు. అలాగేమహిళాఅభ్యర్థులను 28 కేంద్రాల్లోకేటాయించగా, కోఠిఉమెన్స్ కాలేజీలోనిరెండుసెంటర్లలో 71 మందిఎంపికయ్యారు. ఇదిఎలాసాధ్యమనికోర్టుప్రశ్నించింది.
అయితేకోర్టుతీర్పుతో.. కొంతమందిఅభ్యర్థుల్లోఆనందంకిపిస్తున్న్పటికీ..చాలామందిఎంపికైనఅభ్యర్థుల్లోమాత్రంహైటెన్షన్నెలకొంది. ఉద్యోగాలుమానేసిలక్షలమందిపరీక్షలకుప్రిపేర్అయ్యారు. ఇప్పుడుమళ్ళీఅవిరాయాలంటేకష్టమనివాపోతున్నారు. కమిషన్మీదనమ్మకంతోఏళ్లుగాప్రిపేర్అవుతున్నామనిచెబుతున్నారు. కానీవరుసవివాదాలతోటీజీపీఎస్సీమాత్రంనవ్వులపాలవుతోంది. ఇలానేజరిగితేప్రభుత్వఉద్యోగాలపైనిరుద్యోగులునమ్మకంకోల్పోయేప్రమాదంఉందనివిశ్లేషకులుఅంటున్నారు.
Also Read: NO Trump: సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత.. ట్రంప్ పీస్ మేకర్ కాదంటున్న అమెరికన్లు