/rtv/media/media_files/2025/12/10/indigo-tickets-2025-12-10-16-45-24.jpg)
Indigo
Indigo: గత వారం దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సంక్షోభం అల్ల కల్లోలం సృష్టించింది. నిన్నటి నుంచే కాస్త విమానాలు మామూలుగా తిరగడం ప్రారంభం అయింది. అంతకు ముందు వరకు ప్రజలు నానా పాట్లూ పడ్డారు. ఇండిగో వందల సంఖ్యలో సర్వీసుల్ని రద్దు చేయడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఆ ఎఫెక్ట్‌తో ఇతర విమానయాన సంస్థల్లో టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. మామూలుగా కన్నా రెండు, మూడు రెట్లు పెరిగిపోయాయి. ఒకనాకొ టైమ్ లో డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ ధర రూ.40 వేలను తాకింది. ముంబై, ఢిల్లీ విమాన సర్వీస్ టికెట్ ధర రూ.39 వేలు చూపించింది. సాధారణంగా ఈ మార్గం ఫ్లైట్ టికెట్ ధర చివరి నిమిషంలో బుక్ చేసినా 15వేలకు మించదు. అలాంటిది ఒక్కసారే దానికి డబుల్ పెరిగిపోవడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి.
Also Read: స్టూడెంట్స్ పార్టీల ఉచ్చులో పడొద్దు.. ఓయూలో రేవంత్ సంచలన స్పీచ్!
అలా ఎలా రేట్లు పెంచేస్తారు?
దేశాన్ని కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలెందుకు ఇది తలెత్తిందని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. పైగా సంక్షోభ సమయంలో విమాన టికెట్ ధరలు అంతలా ఎందుకు పెరిగాయని ప్రశ్నించింది. ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే.. దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించింది. టికెట్ ధర రూ. 40వేల వరకు ఎలా వెళ్లింది..? అంటూ కోర్టు కేంద్రాన్ని ప్రశ్నల్లో ముంచెత్తింది. సంక్షోభం తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నారు. దీనికి అభినందిస్తున్నాం..కానీ అసలు అది రాకుండా ఎందుకు కట్టడి చేయలేదని కోర్టు కేంద్రాన్ని అడిగింది. దీనికి ఎవరు కారణం..? ఇక్కడ ప్రయాణికులు చిక్కుకుపోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏంటి..?’’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. కానీ కోర్టు ఈ సమాధానాలో సంతృప్తి చెందలేదు. .
Also Read: భారత్ కు క్యూ కడుతున్న కంపెనీలు.. అమెజాన్ భారీ పెట్టుబడులు..10 లక్షల ఉద్యోగాలు
పూర్తి వివరాలు కావాలి..
మరోవైపు సంక్షోభంపై పూర్తి డేటాతో రావాలని ఇండిగో సంస్థకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ సంస్థ సర్వీసుల్లో 10 కోత విధిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తమ ముందు హాజరుకావాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ఇండిగో సీఈవో , సంబంధిత విభాగాల అధికారులు రేపు మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. దాంతో పాటూ ఇండిగో అంతరాయాలకు సంబంధించి సమగ్ర డేటా, అప్‌డేట్‌లు, పూర్తి నివేదికతో రావాలని డీజీసీఏ చెప్పింది. విమాన సర్వీసుల పునరుద్ధరణ, పైలట్లు, సిబ్బంది నియామకాల ప్రణాళిక, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సంఖ్య వివరాలు, రద్దయిన విమానాల సంఖ్య, రీఫండ్‌లు తదితర పూర్తి సమాచారాన్ని అందజేయాలని సూచించింది.
Follow Us