Mohammed Deif: హమాస్ మాస్టర్ మైండ్ మహమ్మద్ డెయిఫ్ హతం!
హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.
హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. జులై 13న ఖాన్ యూనిస్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ హతమైనట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ హతమయ్యాడు. టెహ్రాన్‌లోని అతడి నివాసంపై దాడి చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో ఇస్మాయిల్ బాడీగార్డ్ సైతం మృతి చెందాడు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఇరానియన్ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి.
హమాస్ కమాండర్‌ను మట్టుబెట్టేందుకు దక్షిణ గాజాలోని ఖాన్ యునిస్‌పై ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే ఈ దాడుల్లో హమాస్ కమాండర్ చనిపోలేదు కానీ 90మంది సామాన్యులు మరణించారు. మరో 300మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7 నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది.
గాజాలో హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రతి పురుషుడు 34 నెలల పాటు తప్పకుండా మిలటరీలో పనిచేయాలనే నిబంధన ఉండగా.. ఇప్పుడు దాన్ని మరో మూడేళ్ల వరకు పెంచినట్లు సమాచారం.
హమాస్ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కు తగ్గింది. తమ దగ్గర బందీలను 50 మందికి పైగా ఖైదీలను విడుదల చేసింది. అందులో హమాస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ.. గతంలో బందీగా తీసుకెళ్లిన అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియాను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది.
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
గాజాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400మంది దాకా గాయపడ్డారని సమాచారం.
గాజా ప్రజలపై తన యుద్ధాన్ని ఇజ్రాయేల్ నిలిపివేస్తే.. తాము సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని హామాస్ ప్రకటించింది. అయితే, ఇజ్రాయేల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. హమాస్ యోధులను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యం అని చెబుతోంది.
ఇజ్రాయెల్ పై 'బిగ్ మిస్సైల్'ను ప్రయోగించింది హమాస్. దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు ఎనిమిది రాకెట్లు పేల్చినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. అత్యవసర వైద్య సేవల బృందం తమకు ప్రాణనష్టం గురించి ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది.