Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్‌ రాజధాని దోహాకు ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్‌ -హమాస్‌ లు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

New Update
ISRAEL-HAMAS

ISRAEL-HAMAS

ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్‌ రాజధాని దోహాకు ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్‌ -హమాస్‌ లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా అధికారులు, హమాస్‌ కు చెందిన ఓ ప్రతినిధి ధ్రువీకరించారు. ఈ ఒప్పందం పై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సన్నద్ధమవుతున్నారు.

Also Read: హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్‌గా ప్రకటించిన ఆండర్సన్

కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్‌ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదా పై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరో వైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది.

Also Read: సొంత ఇల్లు, కారు లేవట.. అఫిడవిట్‌లో కేజ్రీవాల్ ఆస్తులు ఇవే!

కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్‌ (Hamas) అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ (Israel) తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి. తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి,ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది.

ఖతార్‌ మధ్యవర్తిత్వం..

కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించింది.కొన్ని నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్‌ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్‌ ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ థానీ ప్రకటించారు.

అక్టోబర్‌ 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌ లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్‌ మధ్య ఆసియాలో యుద్దానికి బీజం వేసింది. హమాస్‌ కు మద్దతుగా హెజ్‌బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పై దాడులకు  దిగాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియనల్ఉఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందారు.

Also Read: USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన

Also Read: KTR : నేడు ఈడీ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు