Ceasefire: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు, బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.

New Update
Israel cabinet

Israel cabinet

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు, బందీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపాలని సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఆదివారం నుంచి ఈ ఒప్పందం అమలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. '' అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించేందుకు ఇది ప్రయోజనకరం. ఈ ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోదించేందుకు సెక్యూరిటీ కేబినెట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని'' ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 

Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ

అలాగే ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు పూర్తిస్థాయి కేబినెట్‌ కూడా వెంటనే సమావేశమవుతుందని పేర్కొంది. అయితే అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వం వల్ల ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమిణ ఒప్పందం సాగుతోంది. ఈ క్రమంలోనే హమాస్‌ బందీల విడుదలకు చేస్తామని చెప్పగా.. దీనికి ప్రతీగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. 

Also Read: బీజీపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ఆ తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి బంధీల కుటుంబాలకు ఇప్పటికే సమాచాం ఇచ్చామని ప్రధాని కార్యాలయం చెప్పింది. ఇదిలాఉండగా..  2023న అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్‌ మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. అలాగే హమాస్‌ మిలిటెంట్లు 250 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకున్నారు. అప్పటినుంచి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుండటంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.      

Also Read: బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు