USA: బందీల విడుదలపై హమాస్ కు ట్రంప్ వార్నింగ్

బందీల విడుదలను ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. బందీల విడుదలపై హమాస్ కు డెడ్ లైన్ విధించారు. వచ్చే శనివారంలోపు అందరినీ విడుదల చేయకపోతే నరకం చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. 

New Update
Donald Trump

Donald Trump

గాజా కాల్పులకు విరమణను ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదని...ఎప్పటిలానే అక్కడ దాడులు చేస్తోందని హమాస్ ఆరోపిస్తోంది. అందుకే తాము బందీల విడుదల ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో హమాస్ కు డెడ్ లైన్ విధించారు. శనివారం నాటికి బందీలందరినీ శిడుదల చేయకపోతే నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు. 

హమాస్ ఇలా చేయడం సరికాదు..

హమాస్ చర్య భయంకరమైనది అని ట్రంప్ అన్నారు. కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయం...కానీ హమాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బందీలను విడుదల చేయాలని చెప్పారు. లేకపోతే నరకం చూపిస్తామని హెచ్చరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయి. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు తామే పిలుపునిస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తో కూడా మాట్లాడతామని ట్రంప్ చెప్పారు. మరోవైపు గాజాను స్వాధీనం చేసుకుని పునర్‌నిర్మిస్తామని ట్రంప్ ఇప్పటికే  ప్రతిపాదించారు. దీనికి పాలస్తీనియన్లు నిరాకరిస్తే మిత్రదేశాలైన జోర్దాన్‌, ఈజిప్ట్‌లకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని ఆయన హెచ్చరించారు. 

Also Read: Business: అల్యూమినియం దిగుమతులపై సుంకం..లక్షల కోట్ల సంపద ఆవిరి

హమాస్ ఇప్పటివరకు పలు దఫాలుగా 21 మంది బందీలను విడుదల చేసింది. ఇంకా వారి దగ్గర చాలా మందే ఉన్నారు. దానికి బదులుగా ఇజ్రాయెల్ 730 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. శనివారం మరికొంత మందిని విడిచిపెట్టాల్సి ఉండగా...ఇప్పుడు హమాస్ ఇలాంటి ప్రకటన చేయడం ఉద్రిక్తతకు దారి తీస్తోంది. 

Also Read: Supreme Court: నీళ్ళు, ఇళ్ళు లేక చాలా మంది ఉంటే..మీకు సైకిల్ ట్రాక్ కావాలా..సుప్రీంకోర్టు ఆగ్రహం

Advertisment
తాజా కథనాలు