Israel-Hamas war:మీకు వేరే దారి లేదు..హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. గాజామీద వాళ్ళ దళాలు విరుచుకుపడుతున్నాయి. కాల్పుల విరమణ చేసేది లేదని అంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. హమాస్ ఉగ్రవాదులకు చనిపోవడం లేదా లొంగిపోవడమే మార్గమని అన్నారు.