యుద్ధం పశ్చిమాసియాకే పరిమితం కాదు.. ఇరాన్ సంచలన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే.. దాని దుష్ర్ఫభావాలు కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదని హెచ్చరించింది. By B Aravind 09 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం లెబనాన్, గాజాలో ఇరాన్ మద్దతు గల హెజ్‌బొల్లా, హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే.. దాని దుష్ర్ఫభావాలు కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల్లో కూడా అస్థిరమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పింది. ఈ విషయాన్ని ప్రపంచం గ్రహించాలని పేర్కొంది. Also Read: RTV రిపోర్టర్‌పై దాడి.. మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యం హమాస్, హెజ్‌బొల్లాకు ఇరాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా ఇజ్రాయెల్ హతం చేసింది. అలాగే పలువురు కీలక హెజ్‌బొల్లా కమాండర్లు కూడా ఈ దాడుల్లో మరణించారు. మరోవైపు హెజ్‌బొల్లా కీలక నేతలు కూడా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత భగ్గుమన్నాయి. అయితే ఖతార్ వేదికగా జరుగుతున్న కాల్పుల విరమణ, బందీల విడుదలకు హమాస్ నేతలు అంగీకరించలేదు. దీంతో హమాస్‌పై బహిష్కరణ వేటు వేయాలని అమెరికా ప్రతిపాదన చేసింది. ఇందుకు ఖతార్ కూడా అంగీకరించినట్లు సమాచారం. Also Read: డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్... మల్లారెడ్డి ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్! ఇదిలాఉండగా.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ హమాస్ నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేస్తోంది. మరోవైపు హెజ్‌బొల్లా కూడా హమాస్‌కు మద్దతివ్వడంతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య కూడా పరస్పర దాడులు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధ వాతవరణంలో పశ్చియమాసియా అట్టుడికిపోతోంది. #telugu-news #israel #iran #hamas #hezbollah #international మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి