/rtv/media/media_files/2025/01/14/nw2S3cFRcx9ueJ4VeeV5.jpg)
Israel- Hamas
2023 అక్టోబర్‌లో మొదలైన ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గాజాలో శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విమరణ ఒప్పందం చర్చలు కొలిక్కి వస్తున్నాయని సమచారం. గాజాలో కాల్పులు విరమణ చేసేందుకు, అలాగే బంధీలను విడుదల చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం చేరువలో ఉన్నట్లు హమాస్- ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్ కూడా చెప్పింది.
Also Read: సౌదీకి వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. రూల్స్ మరింత కఠినం
మరోవైపు చర్చల్లో పురోగతి ఉందని.. దీనికి సంబంధించిన అంశాలు తుది దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్ కూడా తెలిపింది. అయితే ఈ ఒప్పందం చివరి ఆమోదం కోసం ఇజ్రాయెల్ క్యాబెనెట్‌కు సంబంధిత ప్రణాళికను అందించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తమపై కాల్పులకు పాల్పడినందుకు ప్రతీకారంగా హమాస్ మిలిటెంట్లను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గత కొంతకాలంగా గాజాలో దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: నీ గూగుల్ సెర్చ్‌కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు పాల్పడింది. ఆ తర్వాత హమాస్ ఉగ్రవాదులు దాదాు 250 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా తీసుకెళ్లారు. అయితే అదే ఏడాదిలో తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో దాదాపు సగం మంది బందీలను వదిలిపెట్టారు. కానీ ఇంకా 100 మంది బందీలు హమాస్ చెరసాలలో ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో మూడోవంతు మంది చనిపోయినట్లు కూడా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, ఖతర్, ఈజిప్టు దేశాలు యత్నిస్తున్నాయి. మరి ఈసారి జరుగుతున్న శాంతి చర్చల్లో కాల్పుల విమరణ ఒప్పందానికి ఆమోదం లభిస్తుందా ? లేదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: లాస్ ఏంజిల్స్‌లో ఆగని కార్చిచ్చు.. మరింత ప్రమాదం పొంచిఉందంటున్న అధికారులు