తాను అధికారంలోకి వస్తే యుద్ధాలు జరపకుండా చూస్తానని చెప్పారు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇది కీలకం అయింది. ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఆయన అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒకసారి బాధ్యతలు తీసుకోగానే యుద్ధం నివారణ దిశగా అడుగులు వేస్తానని సంకేతాలు ఇచ్చారు ట్రంప్. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..హమాస్ తన చెరలో ఉన్న బందీలందరినీ వెంటనే విడిచి పెట్టాలని చెప్పారు. అలా చేయకపోతే విపరీత పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. నరకం చూపిస్తానని చెప్పారు. హమాస్ మిలిటెంట్ గ్రూప్ మొత్తం సమూలంగా నాశనం అవకుండా ఉండాలంటే తక్షణమే బందీలను విడిచి పెట్టాలని సూచించారు. Also Read: AP: ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం దోహా వెళుతున్నాను.. గతంలో ఏం జరిగిందో తాను పట్టించుకోనని...ఇప్పుడు ఏం జరగాలో ఆదే చేస్తానని చెప్పుకొచ్చారు ట్రంప్. తాను వచ్చే రెండు రోజులు ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్నానని..అక్కడ, పలు అంశాలపై పురోగతి లభిస్తుందని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఇక మరోవైపు హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్యా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. అడపాదడపా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల వీడియోలను రిలీజ్ చేసింది మిలిటెంట్ గ్రూప్. దీని ద్వారా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచాలని అనుకుంది. ఇందులో ఒక ఇజ్రాయెల్ బందీ ఒకరు మాట్లాడుతూ..తాను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా కొనసాగుతున్నట్లు తెలిపాడు. అక్కడ ఉన్నవారంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నారని వాపోయాడు. తమని త్వరగా విడిపించండి అంటూ అభ్యర్థించాడు. Also Read: Tibet: టిబెట్ లో మృత్యుఘోష..ఇప్పటివరకు 126మంది మృతి