Trump: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్..కారణమేంటి

గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్‌ -బైడెన్‌ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

New Update
Donald Trump

Donald Trump

గాజాలో శాంతి ఒప్పందం కుదరగా..మరో చోట వివాదం మొదలైంది. ఈ ఒప్పందం కుదిర్చిన ఘనత సొంతం చేసుకోవడం కోసం ట్రంప్‌ (Donald Trump) -బైడెన్‌ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనికి ప్రస్తుత ఉపాధ్యక్షురాఉ కమలా హారిస్‌ కూడా తోడయ్యారు. తన ప్రమాణ స్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే హమాస్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.మరోవైపు నెతన్యాహును కూడా విమర్శించే ఓ వీడియోను కూడా ఆయన షేర్‌చేశారు.

Also Read: Maha kumbh: మహా కుంభమేళాలో 'డిజిటల్ బాబా'..

నా విజయం కారణంగా..

దీంతో ఇరు వర్గాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇక బైడెన్ కార్యవర్గంలోని ఆంటోని బ్లింకెన్‌ కూడా తరచూ ఇజ్రాయెల్‌ వెళ్లి చర్చలను ముందుకు తీసుకుని వెళ్లారు. ఇజ్రాయెల్‌ -హమాస్‌ ల మధ్య డీల్‌ కుదిరిన వార్తలు వచ్చిన వెంటనే ట్రంప్‌ సోషల్‌ మీడియా ట్రూత్‌ లో స్పందించారు. ఇది చాలా గొప్ప కాల్పుల విరమణ ఒప్పందం. నవంబర్‌ లో నా విజయం కారణంగా నా కార్యవర్గం ఎప్పుడు శాంతిని కోరుకుంటుందనే విషయాన్ని ప్రపంచం మొత్తానికి చెప్పింది. మొత్తం అమెరికన్లు, మిత్రుల భద్రతను కాపాడేందుకు అవసరమైన ఒప్పందాలపై చర్చిస్తామనడానికి ఇది చిహ్నం గా నిలిచిందని పేర్కొన్నారు.

Also Read: USA: హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్‌గా ప్రకటించిన ఆండర్సన్

మరో వైపు బైడెన్‌ తన చివరి ప్రసంగం ప్రారంభంలో మాట్లాడుతూ..తాను గత మే నెలలో ప్రస్తావించిన అంశాలు ఈ డీల్‌ లో ఉన్నాయి. వాటిని ఐరాసతో భద్రతామండలి సహా అన్ని దేశాలు అత్యధికంగా ఆమోదించాయని పేర్కొన్నారు. తన కెరీర్‌ లోనే చేసిన ఎంతో కష్టమైన డీల్‌ ఇదే అని ఆయన  చెప్పారు. కాబోయే అధ్యక్షుడి బృందంతో కూడా సమన్వయం చేసుకొని చర్చలు ముందుకు తీసుకెళ్లాలని తన బృందానికి సూచించినట్లు పేర్కొన్నారు.

కానీ ఈ శాంతి ఒప్పందం కుదరడంలో ట్రంప్‌ పాత్ర లేదని బైడెన్‌ కొట్టి పారేశారు. ఈ అంశం పై ఓ విలేకరి ప్రశ్నించగా..అది జోకా ..? అంటూ వెటకారంగా స్పందించారు. మరో వైపు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా స్పందిస్తూ..ఈ డీల్‌ కుదిర్చినందుకు జో బైడెన్‌ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు అధిక ప్రాధాన్యం ఇస్తారన్నారు.

మరో వైపు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు స్పందిస్తూ ట్రంప్‌ బైడెన్‌ ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది బందీలను విడిపించడంలో కీలక పాత్ర పోషించినందుకు ట్రంప్‌ నకు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పుకొచ్చారు.అంతకు ముందు ఆయన జో బైడెన్‌ (Joe Biden) తో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు. 

Also Read: USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన

Also Read: Aadhaar: ఒక్క ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు.. మీ అకౌంట్ లోకి రూ.50 వేలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు