/rtv/media/media_files/2025/01/25/BsJP7vepYEnWEHGwPv3W.jpg)
Israeli hostages Photograph: (Israeli hostages)
ఇజ్రాయిల్ దేశంతో హమాస్ కాల్పుల విరమణ సంది చేసుకున్నాయి. గాజా ఒప్పందంలో భాగంగా హామాస్ బందీలుగా ఉన్న నలుగురు మహిళ సైనికులను శనివారం అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. 477 రోజులపాటు కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ లు బందీలుగా ఉన్నారు. జనవరి 25న హమాస్ వారిని విడుదల చేసింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడి సమయంలో హమాస్‌కి ఈ ముగ్గురు పట్టుబడ్డారు.
🚨 They are home! 🚨
— Hamas Atrocities (@HamasAtrocities) January 25, 2025
Hamas liberated the four hostages!
But not before they dragged them to a cynical show on a stage!
This stupid propaganda is useless!
Welcome home Naama, Liri, Daniela and Karina! ❤️ pic.twitter.com/FYtEtnWnOW
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం పాలస్తీనా ఖైదీలకు బదులుగా వారు విడుదల చేయబడ్డారు. దీనికి బదులుగా ఇజ్రాయిల్ 200 మంది ఖైదీలను విడుదల చేయనుంది. ఇన్ని రోజులు వారు గాజా సమీపంలోని అబ్జర్వేషన్ పోస్ట్‌లో ఉన్నారు. 15 నెలలుగా గాజాలో ఇజ్రాయిల్ సైన్యానికి, హమాస్ సంస్థకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. హమాస్ గతంలో 90 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసింది.