Israel: హమాస్ ఎటాక్ ఎఫెక్ట్...ఐడీఎఫ్ ఛీఫ్ రాజీనామా

ఇజ్రాయెల్ సైన్యం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ రాజీనామా చేశారు. హమాస్ దాడి చేసినప్పుడు దాన్ని నివారించడంలో తాను విఫలమయ్యాయని...అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. దాడిపై దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. 

New Update
israel

IDF Cheif Halevi

ఇజ్రాయెల్, హమస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మొత్తానికి యుద్ధం ఆగింది. మొదట హమాస్..ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హామాస్ ను నాశనం చేసేవరకు వదిలిపెట్టమని పంతం పట్టింది. దాదాపు రెండేళ్లుగా రెండు వర్గాలు మధ్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అమెరికా జోక్యంతో యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ రెండూ అంగీకరించాయి. దీని తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి గుడ్‌బై చెప్పారు. మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2025, మార్చి 6న అత్యున్నత పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.  అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని నివారించడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ  తన ఉద్యోగం నుంచి వైదొలిగినట్లు చెప్పారు. హమాస్ దాడిపై పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ విషయం మీద రక్షణ మంత్రికి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు లేఖ పంపించానని తెలిపారు. ఈ యుద్ధంలో ఐడీఎఫ్ విజయం సాధించిందని హలేవీ చెప్పారు. హమాస్ బందీలను విడుదల చేస్తోందని..ఆ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. తన తర్వాత వచ్చే ఆఫీసర్ కు అన్ని వివరాలను , ఐడీఎఫ్ కమాండ్ ను బదిలీ చేస్తానని చెప్పారు. 

కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించింది.కొన్ని నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్‌ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్‌ ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ థానీ ప్రకటించారు.

అక్టోబర్‌ 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌ లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్‌ మధ్య ఆసియాలో యుద్దానికి బీజం వేసింది. హమాస్‌ కు మద్దతుగా హెజ్‌బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పై దాడులకు  దిగాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియనల్ఉఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందారు. 

ఇది కూడా చదవండి: Khammam: ఇంటి ముందు ముగ్గేస్తుండగా యువతిపై యాసిడ్ దాడి.. కారణం తెలిస్తే కంగుతింటారు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు