Gaza: గాజాలో ఆకలి మరణాలు.. వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్, అమల్లోకి కాల్పుల విరమణ
గాజాలో పెరుగుతున్న ఆకలి మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కాస్త దిగొచ్చింది. పాక్షిక కాల్పుల విరమణను ప్రకటించింది.
గాజాలో పెరుగుతున్న ఆకలి మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కాస్త దిగొచ్చింది. పాక్షిక కాల్పుల విరమణను ప్రకటించింది.
హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అధినేత యాహ్యా సిన్వార్ గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సిన్వార్ మృతి తర్వాత భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ తన పిల్లలతో కలిసి ఓ నకిలీ పాస్‌పోర్టు ద్వారా టర్కీకి పారిపోయి అక్కడ మరో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 94 మంది మృతి చెందారు. గాజా ఆరోగ్యశాఖ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. మానవతా సాయం అందిస్తున్న పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన కాల్పుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించి సంధి కుదుర్చుకోవాలని తన సోషల్ మీడియా అయిన ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రస్తుతం హమాస్‌తో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
గాజాలోని రఫాలో 'గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్' కేంద్రం వద్ద జరిగిన కాల్పులకు తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ కాల్పులు జరిపిందని పేర్కొంది. దీనికి సంబంధించి డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది.
మే 13న గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 30 సెకండ్లలోనే 50కి పైగా బాంబులు పడ్డాయి. అయితే ఈ ఆపరేషన్‌లో హమాస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు మహ్మద్ సిన్వర్, మహ్మద్ షబానా మరణించినట్లు తాజాగా ఐడీఎఫ్ వెల్లడించింది.
అమెరికా హమాస్‌కు కీలక ప్రతిపాదన చేసింది. కాల్పుల విరమణ, బందీల విడుదలకు అంగీకరించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు ఓ న్యూస్ ఛానల్‌కు చెప్పాడు.
ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. ఏడాదిన్నరగా గాజాలో మీరు 19 వేల చిన్నారుల ప్రాణాలు తీశారని విమర్శించారు.