/rtv/media/media_files/2025/08/03/israeli-hostage-breaks-down-inside-hamas-tunnel-2025-08-03-18-51-23.jpg)
Israeli Hostage Breaks Down Inside Hamas Tunnel
ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇంకా సాగుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు పక్షాలు ముందుకు రావడం లేదు. హమాస్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దీంతో అక్కడ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే హమాస్ వద్ద ఇజ్రాయెల్ బందీలు.. ఇజ్రాయెల్ వద్ద హమాస్ బందీలు ఉన్నారు. అయితే తమ వద్ద నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీల పరిస్థితిపై హమాస్ కొన్ని వీడియోలు విడుదల చేసింది. ఓ వీడియోలో ఒక ఇజ్రాయెల్ యువకులు తన సమాధిని తానే తవ్వుకుంటున్నట్లు కనిపించడం కలకలం రేపింది.
Also read: ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528.. నెలకు జీతం ఇంత తక్కువనా?
ఆ వీడియోలో గమనిస్తే ఇజ్రాయెల్‌కు చెందిన ఎవ్యతార్ డేవిడ్ (24) అనే యువకుడు బక్క చిక్కిన శరీరంతో కనిపించాడు. తాను ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి వివరించాడు. రోజురోజుకు తన శరీరం క్షీణిస్తుందని.. కుటుంబంతో గడిపే పరిస్థితి కనిపించడం లేదని వాపోయాడు. విడుదలకు సమయం ఆలస్యమవుతుందని.. అందుకే నా సమాధిని నేనే తవ్వుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. హమాస్ గత రెండు రోజుల్లో ఇలాంటి వీడియోలు విడుదల చేసింది. కాల్పుల విరమణ చేస్తేనే వీళ్లు సజీవంగా ఉంటారని పేర్కొంది.
How psychopathic is Hamas?
— Eylon Levy (@EylonALevy) August 2, 2025
It forced starving hostage Evyatar David to DIG HIS OWN GRAVE for the cameras. pic.twitter.com/iMa404St4s
ఎవ్యతార్ డేవిడ్ ఎవరు ?
2023లో అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో హమాస్ పలువురు ఇజ్రాయెల్ పౌరులను కిడ్నాప్ చేసింది. వాళ్లలో ఒకరే ఎవ్యతార్ డేవిడ్. దక్షిణ ఇజ్రాయెల్‌లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో అతడు పాల్గొనగా హమాస్ ముష్కరులు కిడ్నాప్ చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి అతడు బందీగా ఉంటున్నాడు. హమాస్ దశల వారికి కొంతమందిని విడుదల చేసింది. అయినప్పటికీ మరో 49 మంది హమాస్ చెరలోనే ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. డేవిడ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Also Read: దారుణం.. కుక్కలు తిన్న భోజనాన్ని విద్యార్థులకు పెట్టారు
ఇదిలాఉండగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉంది. తమ బందీలను విడిచిపెట్టేవరకు దాడులు కొనసాగుతాయని ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే గాజాలోని మానవతాసాయ కేంద్రాల వద్ద కూడా దాడులు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత రెండు నెలల్లో మానవతా కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 859 మంది మృతి చెందినట్లు ఐరాస రిపోర్టు తెలిపింది. మరోవైపు పరిమిత స్థాయిలోనే ఆహార పదార్థాలు రావడంతో అక్కడి స్థానికులు ఎగబడుతున్నారు. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ అక్కడ కాల్పులు చేయడంతో అమాయకులు కూడా చనిపోతున్నారు. అంతేకాదు ఇటీవల తిండిలేక వందకు పైగా చిన్నారులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.
Also Read: అక్కడ 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు.. ఎన్నికల సంఘంపై చిదంబరం విమర్శలు