/rtv/media/media_files/2025/07/28/gaza-2025-07-28-13-59-51.jpg)
Gaza
ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో తీవ్ర దుర్భర పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆహారం కోసం సహాయక కేంద్రాల వద్ద ఎగబడుతున్నారు. మరికొందరికి ఆహారమే దొరకడం లేదు. ఇటీవలే ఆకలితో అలమటించి 100 మందికి పైగా మ-ృతి చెందారు. గాజాలో పెరుగుతున్న ఆకలి మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కాస్త దిగొచ్చింది. పాక్షిక కాల్పుల విరమణను ప్రకటించింది.
Also Read: ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - రాష్ట్రంలో బయటపడ్డ మోసం
గాజాలోని జనాభా ఎక్కువగా ఉండే మూడు ప్రాంతాల్లో రోజుకు 10 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారమే దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గాజా సిటీ, డెయిర్ అల్‌బలా, మువాసీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఉండునుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీన్ని అమలు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
Also Read: షాకింగ్ వీడియో.. ఘోర రైలు ప్రమాదం - ప్రాణాలు వదిలిన ప్రయాణికులు
ఇలా చేయడం వల్ల స్థానిక ప్రజలకు ఆహారం అందేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ పాక్షిక కాల్పుల విరమణ చేయడంతో ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ దీన్ని స్వాగతించింది. అలాగే అవసరమైన ప్రజలందరికీ ఆహారం అందించాలంటే విస్తృత కాల్పుల విరమణ అవసరమని సూచించింది. ఇక హమాస్ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. గాజాలోని మిగిలిన ప్రాంతాల్లో హమాస్‌కు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
Also Read: ప్రియుడితో తల్లి రాసలీలలు.. కొడుకు తిట్టడంతో.. అతి కిరాతకంగా తల్లి ఏం చేసిందంటే?