/rtv/media/media_files/2025/06/02/gWqQuswY1mbepBVp7I6K.jpg)
IDF confirms Hamas leader Muhammad Sinwar killed in May 13 strike
గత కొన్నిరోజులుగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. మే 13న జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కేవలం 30 సెకండ్లలోనే 50కి పైగా బాంబులు పడ్డాయి. అయితే ఈ ఆపరేషన్‌లో హమాస్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు మహ్మద్ సిన్వర్, మహ్మద్ షబానా మరణించినట్లు తాజాగా ఐడీఎఫ్ వెల్లడించింది. అయితే మహ్మద్ సిన్వర్ హమాస్ సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్రను పోషించాడు.
Also Read: బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులపై AICTE కీలక ప్రకటన
IDF Confirms Hamas Leader Muhammad Sinwar Killed
అంతేకాదు హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ సోదరుడే మహ్మద్ సిన్వర్. హమాస్ మిలటరీ వింగ్ సారథి డెయిఫ్ మృతి చెందిన తర్వాత మహ్మద్ సిన్వర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మెరుపుదాడి సూత్రధారిగా ఉన్న యాహ్యా సిన్వర్ గతేడాది మృతి చెందిన సంగతి తెలిసిందే. యాహ్యా మరణాంతరం సోదరుడు మహ్మద్ సిన్వర్ టాప్ కమాండర్‌గా ఎదిగాడు. తాజాగా సిన్వర్ కూడా హతమయ్యాడు.
Also Read: రష్యాకు బిగ్ షాక్.. 40 విమానాలను నాశనం చేసిన ఉక్రెయిన్
అయితే హమాస్ ఉద్దేశపూర్వకంగానే ఆస్పత్రులు వంటి పౌర నిర్మాణాల కింద కమాండ్ నిర్మించిందని.. దీనివల్ల పౌరులు ప్రమాదంలో పడ్డారని ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడికి ముందు, దాడి సమయంలో ఇజ్రాయెల్ పౌరులు హాని కలగకుండా శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొంది. కానీ ఈ దాడిలో 16 మంది మరణించారని.. 70 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌కు రూ.30 కోట్లు లాటరీ డబ్బు ఇస్తే.. మంచంలో మరో యువకుడితో..!
Also Read: అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 21 మంది అథ్లెట్స్ మృతి
telugu-news | rtv-news | israel | hamas | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu