/rtv/media/media_files/2025/07/27/hamas-chief-wife-2025-07-27-21-01-54.jpg)
Hamas Chief Wife
హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ గతేడాది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సిన్వార్ మృతి తర్వాత తన భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ తన పిల్లలతో కలిసి ఓ నకిలీ పాస్‌పోర్టు ద్వారా టర్కీకి పారిపోయినట్లు తెలుస్తోంది. అక్కడ సమర్ మరో వివాహం కూడా చేసుకున్నట్లు ఇటీవల ఇజ్రాయెల్ వెల్లడించింది. సమర్‌కు సిన్వార్‌తో 2011లో పెళ్లి జరిగింది.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
Ex-Hamas chief Yahya Sinwar's widow remarries in Turkey after escaping Gaza with fake passport
— Mint (@livemint) July 27, 2025
More details 👇https://t.co/DD1fKmQy86
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
నకిలీ పాస్‌పోర్టు ద్వారా..
ఇజ్రాయెల్ గాజాపై దాడి చేయడంతో సిన్వార్ మృతి చెందాడు. దీంతో ఆమె హమాస్ ఉన్నతాధికారుల సాయంతో గాజాలోని ఓ మహిళ పాస్‌పోర్టును వాడుకుని ఫస్ట్ ఈజిప్టుకు వెళ్లింది. ఆ తర్వాత అక్కడ నుంచి టర్కీకి వెళ్లింది. అక్కడ ఆమె మరో పెళ్లి చేసుకోవడానికి రాజకీయ బ్యూరోలోని సీనియర్ అధికారి ఫాతి హమ్మద్ సహాయం చేసినట్లు సమాచారం. యాహ్యా సిన్వార్‌తో పాటు తన సోదరుడు మహమ్మద్ సిన్వార్ కూడా మరణించాడు. ఇతను చనిపోయిన తర్వాత యాహ్యా భార్య నజ్వా కార్యాలయంలో నకిలీ పాస్‌పోర్టులను తయారు చేసే విభాగానికి అధిపతిగా ఉంది. ఆ తర్వాత సిన్వార్ కూడా మృతి చెందడంతో గాజా వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ఇదిలా ఉండగా హమాస్ ఉగ్రవాదులు 2023లో ఇజ్రాయెల్‌పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 1200 మంది మృతి చెందగా, 250 మందిని హమాస్ బందీలుగా చేసింది. దీంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చోవాలని భావించిన ఇజ్రాయెల్.. దాడులకు సూత్రధారి అయిన హమాస్ అధినేత సిన్వార్‌ను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ గాజాపై గతేడాది దాడులు జరపగా.. సిన్వార్ మృతి చెందాడు. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ తెలిపింది.