Trump: హమాస్‌తో ఒప్పందం చేసుకోండి.. ట్రంప్‌ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించి సంధి కుదుర్చుకోవాలని తన సోషల్ మీడియా అయిన ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రస్తుతం హమాస్‌తో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

New Update
Trump

Trump

ఇజ్రాయెల్‌ హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించి సంధి కుదుర్చుకోవాలని తన సోషల్ మీడియా అయిన ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు. గాజాలో ఒప్పందం చేసుకోండి. బందీలను వెనక్కి తీసుకురండి అంటూ రాసుకొచ్చారు. గతంలోనే ఆయన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించారు. తాజాగా మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై కేసులు వదిలేయని ఆ దేశ ప్రాసిక్యూటర్లను అభ్యర్థించిన కొన్ని గంటల్లో ట్రంప్ ఈ పోస్టు పెట్టారు. 

Also Read: మరో ఘోరం.. విమానం కూలి నలుగురు దుర్మరణం

Trump Calls On Gaza War

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రస్తుతం హమాస్‌తో చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే బందీలు వెనక్కీ వస్తారని తెలిపారు. అయితే గత బుధవారం ట్రంప్‌ సోషల్ మీడియాలో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహూపై కేసులు పెట్టడం అనేది ఆయన్ని వేధింపులు గురిచేసేందుకే అని అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరగగా.. ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి నెతన్యాహూ కూడా ట్రంప్‌కు క-ృతజ్ఞతలు తెలిపారు. 

Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు

అంతేకాదు ఈమధ్య కాలంలో చూసుకుంటే ఇజ్రాయెల్‌కు అమెరికా ఆర్థిక సాయాన్ని కూడా పెంచింది. అమెరికా నుంచి గణనీయమైన ఆర్థిక సాయం ఇజ్రాయెల్‌కు తప్ప మరే దేశానికి రాలేదు. ఇదిలాఉండగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 251 మంది బందీలుగా తీసుకెళ్లింది. వీళ్లలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 49 మంది హమాస్‌ చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దిగజారిపోయాయి. తిండి దొరక్క అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు.  

Also Read: పాకిస్థాన్‌లో ఆత్మహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి

Also Read :  రోడ్డు పక్కన బుట్టలో నవజాత శిశువు.. లేటర్‌లో ఏం రాశారంటే ?

hamas | israel iran war | rtv-news | telugu-news

Advertisment
తాజా కథనాలు