Sinwar Killed in Gaza Airstrikes: మహ్మద్ సిన్వర్ ఖతం..కన్ఫార్మ్ చేసిన నెతన్యాహు

ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలో ఐడీఎఫ్ ఒక ఆసుపత్రిపై దాడి చేసిందని..అందులో సిన్వర్ చనిపోయాడని చెప్పారు.

New Update
Israel-Hamas war:మీకు వేరే దారి లేదు..హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం

Sinwar Killed in Gaza Airstrikes: దక్షిణ గాజాలోని(Gaza) ఖాన్ యూనిస్ పై ఇజ్రాయెల్ ఆర్మీ(Israel Army) భీకర దాడులు చేసింది. హమాస్ కమాండ్ సెంటర్(Hamas Command Center) పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఖాన్ యూనిస్ లో ఐరోపా హాస్పిటల్ కింద భూగర్భంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉంది. దీనిపై ఇజ్రాయెల్ దళాలు గురి చూసి దాడులు చేశాయి. ఇందులో హమాస్‌ టాప్‌లీడర్‌, యాహ్యా సిన్వార్‌(Yahya Al-Sinwar) సోదరుడు మహమ్మద్‌ సిన్వర్‌(Mohammed Sinwar) మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఐడీఎఫ్ దానిపై ఏమీ ప్రకటన చేయలేదు. 

Also Read: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

చనిపోయాడు అనుకుంటా..

ఇప్పుడు దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. ఐదు నెలల తర్వాత ఆయన మీడియాతో మొదటిసారి మాట్లాడారు. హమాస్ నాయకుడు మొహ్మద్ సిన్వర్ చనిపోయే అవకాశం ఉందని చెప్పారు. మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలోని ఒక ఆస్పత్రిపై ఐడీఎఫ్ దాడి చేసింది. ఆ దాడిలో మొహమ్మద్ సిన్వార్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతడి మరణవార్తను ఇప్పటి వరకు హమాస్ నిర్ధారించలేదు.

Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

ఇప్పటివరకు మొత్తం 10వేల మంది హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించనట్లు నెతన్యాహు చెప్పారు. హనియే, యాహ్వా సిన్వార్ లాంటి హమాస్ నేతలతో పాటూ ఇప్పుడు మహ్మద్ సిన్వర్ను కూడా మట్టుబెట్టినట్టు తెలిపారు.  గాజా నియంత్రణ కోసం సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తామని చెప్పారు. బందీలను విడుదల చేస్తామంటే తాత్కాలిక కాల్పుల విరమణకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. గాజాపై పూర్తి నియంత్రణ వచ్చే వరకు ఊరుకునేది లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. 

Also Read: USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం

Also Read: IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం

today-latest-news-in-telugu | benjamin-netanyahu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు