Israel: గాజా పౌరులపై హమాస్‌ కాల్పులు.. వీడియో వైరల్

గాజాలోని రఫాలో 'గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్' కేంద్రం వద్ద జరిగిన కాల్పులకు తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్‌ కాల్పులు జరిపిందని పేర్కొంది. దీనికి సంబంధించి డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది.

author-image
By B Aravind
New Update
Israel Blames Hamas For Killing Gaza Civilians At Aid Site In Rafah, Shares Drone Video

Israel Blames Hamas For Killing Gaza Civilians At Aid Site In Rafah

గాజాలోని రఫాలో 'గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్' కేంద్రం వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు ఐడీఎఫ్‌ దళాలే కారణమని ఆరోపణలు వచ్చాయి. కానీ ఇజ్రాయెల్‌ ఈ దాడులను తిరస్కరించింది. ఈ ఘటన వెనుక హమాస్ ఉందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓ డ్రోన్ వీడియోను కూడా ఎక్స్‌లో విడుదల చేసింది.   

'' ఆహారం తీసుకునేందుకు వెళ్తున్న వాళ్లపై ఓ గన్‌మెన్‌ కాల్పులు జరుపుతున్నట్లు  డ్రోన్‌ విజువల్స్‌ ఉన్నాయి. అక్కడి ప్రజలు ఆహారం తీసుకోకుండా అడ్డుకోవడానికి హమాస్ తన శక్తిని ప్రయోగించిందిని'' ఐడీఎఫ్‌ రాసుకొచ్చింది. ఇక ఈ దాడులు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులను తల, ఛాతిపై కాల్చి చంపినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ దాడులు జరిగిన ప్రదేశం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

Also Read: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆహారం, అత్యవసర సరకుల కోసం వచ్చిన పాలస్తీనియన్లపై ఆదివారం ఉదయం కాల్పులు జరిగాయి. అయితే ఈ దాడిలో 31 మంది మృతి చెందారు. 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇజ్రాయెల్ మద్దతున్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) వద్ద ఈ దాడి జరిగినట్లు గాజా ఆరోగ్యశాఖ చెప్పింది. 

వేల సంఖ్యలో వస్తున్న జనంపైకి కిలోమీటర్ దూరం నుంచి అన్నివైపుల నుంచి కాల్పులు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే సైన్యం కాల్పులు జరిపిందన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఐడీఎఫ్‌ చెప్పింది. అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా సాయం పంపిణీ జరిగినట్లు జీహెచ్‌ఎఫ్‌ తెలిపింది.  

Also Read: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. జెలెన్స్కీ సంచలన ప్రకటన

gaza | telugu-news | rtv-news | israel | hamas | israel-hamas

Advertisment
Advertisment
తాజా కథనాలు